ముగ్గురు రెబల్స్‌ పై స్పీకర్ వేటు: బీజేపీ పెద్దల్లో గుబులు, యడ్డీ ఆలోచన ఇదేనా..?

By Siva KodatiFirst Published Jul 26, 2019, 10:16 AM IST
Highlights

ముగ్గురు రెబెల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేయడంతో బీజేపీ పెద్దల్లో గుబులు మొదలైంది.మరికొందమందిపై వేటు పడేలోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కమలనాథులు వేగంగా పావులు కదుపుతున్నారు.

కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా బీజేపీ వడివడిగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా మరికాసేపట్లో యడ్యూరప్ప .. గవర్నర్ వాజూభాయ్ వాలాను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన బలం తనకు ఉందని తెలిపే అవకాశం ఉంది.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే శుక్రవారం మధ్యాహ్నమే యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే అవకాశాలు పుష్కళంగా ఉన్నాయి. మరోవైపు బలపరీక్ష తర్వాత యడ్డీనే సీఎం అవుతారని దేశం మొత్తం భావించింది.

అయితే ఆయనకు హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇంకా రాకపోవడంతో యడ్యూరప్ప అసహనంగా ఉణ్నారు. నిన్న తన తరుపున ఆర్ అశోక్‌ను ఆయన ఢిల్లీకి పంపినప్పటికీ.. అమిత్ షా ఇంకా వేచి చూసే ధోరణిలోనే ఉండటం యడ్డీకి ఆగ్రహాన్ని తెప్పించింది.

సుధీర్ఘ నిరీక్షణ తర్వాత అధికారాన్ని అందుకుంటున్న వేళ.. తన పట్ల అధిష్టానం వైఖరి సరిగా లేదని ఆయన కుమిలిపోతున్నారు. మరోవైపు ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడంతో కన్నడ నాట రాజకీయాలు అనూహ్యంగా మారిపోతున్నాయి.

మరికొందరిపై వేటు వేయడానికి ముందే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. అలాగే ముఖ్యమంత్రిగా యడ్యూరప్పను కాదని మరో వ్యక్తి పేరును సూచిస్తే.. అంగీకరించేది లేదని మెజారిటీ బీజేపీ శాసనసభ్యులు పట్టుబడుతుండటంతో  హైకమాండ్ సైతం ఆచితూచి అడుగేయాలని చూస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కర్ణాటకలో రాజకీయాలు మళ్లీ ఉత్కంఠగా మారాయి. 

click me!