కుమారస్వామి వద్దని ముందే చెప్పా.. దేవెగౌడ కామెంట్స్

By telugu teamFirst Published Jul 26, 2019, 8:00 AM IST
Highlights

జేడీఎస్ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో కుమారస్వామి ముఖ్యమంత్రిగా కొనసాగడంతో ఆయనపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ 16 మంది ఇరు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. అయితే ఇదే విషయంపై మాజీ ప్రధాని దేవెగౌడ స్పందించారు.

కర్ణాటక రాజకీయాలు రోజుకో ములుపు తిరుగుతున్నాయి. బలపరీక్షలో సంకీర్ణ ప్రభుత్వం ఓటమిపాలవ్వగా.. బీజేపీ విజయం సాధించింది. కాగా.. గురువారం  కర్ణాటకలో మరిన్ని ఉత్కంఠ పరిణామాలు చోటుచేసుకున్నాయి.  ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేష్ కుమార్ వేటు వేయడంతో కర్ణాటక రాజకీయాలు మరింత రంజుగా మారాయి.

జేడీఎస్ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో కుమారస్వామి ముఖ్యమంత్రిగా కొనసాగడంతో ఆయనపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ 16 మంది ఇరు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. అయితే ఇదే విషయంపై మాజీ ప్రధాని దేవెగౌడ స్పందించారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో పలు విషయాలు వెల్లడించారు.

గత ఏడాది జరిగిన ఎన్నికల ఫలితాలను బట్టి కాంగ్రెస్‌కు అధికస్ధానాలు వచ్చాయని, కానీ ముఖ్యమంత్రిగా కుమారస్వామిని  నియమించడంపై తాను అభ్యంతరం వ్యక్తం చేశానని గుర్తుచేశారు. మల్లిఖార్జున ఖర్గే సీఎం అవుతారని తాను భావించినట్లు దేవెగౌడ వివరించారు.

జేడీఎస్‌కు 37, కాంగ్రెస్‌కు 79 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు సహజంగానే ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నుంచి ఎన్నిక కావాల్సి ఉన్నప్పటికీ కుమారస్వామిని సీఎం చేయాలని యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ నిర్ణయించారని దేవెగౌడ చెప్పారు. ప్రస్తుతం కర్ణాటకలో ఏర్పడ్డ పరిస్థితులతో తాను ఎలాంటి ఆశ్చర్చానికి గురికాలేదంటూ వ్యాఖ్యానించారు.

click me!