జేడీఎస్- కాంగ్రెస్ సంకీర్ణానికి గుడ్‌బై చెప్పిన ఇద్దరు ఎమ్మెల్యేలు

By narsimha lodeFirst Published Jan 15, 2019, 3:23 PM IST
Highlights

 కర్ణాటక రాష్ట్రంలోని జేడీఎస్-కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వానికి ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మద్దతును ఉపసంహరించుకొంటున్నట్టు మంగళవారం నాడు ప్రకటించారు.


బెంగుళూరు:  కర్ణాటక రాష్ట్రంలోని జేడీఎస్-కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వానికి ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మద్దతును ఉపసంహరించుకొంటున్నట్టు మంగళవారం నాడు ప్రకటించారు.

సంక్రాంతి తర్వాత కర్ణాటకలో ప్రభుత్వం మారనుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇందులో భాగంగానే బీజేపీ నాయకత్వం తమ పార్టీకి చెందిన 102 మంది ఎమ్మెల్యేలను రిసార్ట్స్‌కు తరలించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కొందరు బీజేపీతో టచ్‌లోకి వెళ్లినట్టు ప్రచారం సాగుతోంది.

రిసార్ట్స్ లో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలతో మాజీ సీఎం యడ్యూరప్ప చర్చించారు. ఇదిలా ఉంటే ప్రభుత్వానికి వచ్చిన నష్టం లేదని కాంగ్రెస్ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.


సంబంధిత వార్తలు

కుమారస్వామికి గండం: మళ్లీ రిసార్ట్స్ రాజకీయాలు

 

click me!