‘‘చెబితా వినరా...కాళ్లు, చేతులు నరికేస్తా’’: అధికారికి కాంగ్రెస్ ఎమ్మెల్యే వార్నింగ్

sivanagaprasad kodati |  
Published : Jan 06, 2019, 04:55 PM IST
‘‘చెబితా వినరా...కాళ్లు, చేతులు నరికేస్తా’’: అధికారికి కాంగ్రెస్ ఎమ్మెల్యే వార్నింగ్

సారాంశం

చెప్పిన మాట వినకుంటే నీ కాళ్లు చేతులు నరికేస్తానంటూ ఓ ప్రభుత్వోద్యోగిని ఎమ్మెల్యే ఒకరు బెదిరించిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. భద్రావతి ప్రాంతంలో కొందరు గ్రామస్తులు దేవాలయాన్ని నిర్మించాలని భావించారు

చెప్పిన మాట వినకుంటే నీ కాళ్లు చేతులు నరికేస్తానంటూ ఓ ప్రభుత్వోద్యోగిని ఎమ్మెల్యే ఒకరు బెదిరించిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. భద్రావతి ప్రాంతంలో కొందరు గ్రామస్తులు దేవాలయాన్ని నిర్మించాలని భావించారు.. ఇందుకు సంబంధించి పనులకు కూడా శంకుస్థాపన చేశారు.

ఈ క్రమంలో అటవీశాఖకు చెందిన భూమిలో నిర్మాణాలు చేపట్టరాదంటూ ఓ అధికారి గ్రామస్తులకు అడ్డు తగిలారు.. నిర్మాణాలు చేపట్టాలంటే అనుమతి తీసుకోవాలని అప్పటివరకు పనులు చేపట్టరాదంటూ తెలిపారు.

దీంతో గ్రామస్తులు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీకే సంగమేశ్వరను ఆశ్రయించారు. అక్కడికి చేరుకున్న ఆయన సంబంధిత అధికారికి గ్రామస్తుల ముందే ఫోన్ చేసి, వారి పనులకు అడ్డుతగలద్దొని హెచ్చరించారు.

‘‘గ్రామస్తులు ఈ రోజు తమ ఆచారం ప్రకారం పూజలు జరిపారు.. ఇక్కడ జరుగుతున్న నిర్మాణాన్ని ఎవ్వరూ అడ్డుకోవద్దు.. ఒకవేళ అడ్డుకున్నారో మీ.. కాళ్లు, చేతులు నరికేస్తా’’నంటూ బెదిరించారు. అధికారితో ఎమ్మెల్యే సంభాషణకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో కర్ణాటకలో ఇది హాట్ టాపిక్‌గా మారింది.

PREV
click me!

Recommended Stories

Top 5 Government Schemes : రైతులకు నేరుగా డబ్బులు.. ఈ ఐదు పథకాలేవో మీకు తెలుసా?
Viral Video: బతికున్న కూతురుకు అంత్య‌క్రియ‌లు చేసిన తండ్రి.. వైర‌ల్ అవుతోన్న వీడియో