ఎన్డీఏ ప్రధాని అభ్యర్ధి రేసులో నితీశ్ కుమార్..ప్రకటించిన జేడీఎస్

By sivanagaprasad kodatiFirst Published Jan 6, 2019, 4:13 PM IST
Highlights

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి ఎవరు అన్న చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలకు తోడు మమతా బెనర్జీ, మయావతి, చంద్రబాబు వంటి ప్రముఖల పేర్లు వినిపిస్తున్నాయి. 

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి ఎవరు అన్న చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీలకు తోడు మమతా బెనర్జీ, మయావతి, చంద్రబాబు వంటి ప్రముఖల పేర్లు వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ లిస్ట్‌లోకి జేడీఎస్ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సైతం చేరారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ తరపున ప్రధాని అభ్యర్ధిగా నితీశ్ కుమార్ సైతం రేసులో ఉంటారని జేడీ(యూ) స్పష్టం చేసింది.  

రాజకీయాల్లో నితీశ్ ప్రస్థానం స్ఫూర్తివంతంగా సాగిందని, బిహార్‌ను ఆయన ఒంటిచేత్తో అభివృద్ధిపథంలో నిలిపారని జేడీ(యూ) ప్రతినిధి రాజీవ్ రంజన్ తెలిపారు. ఎన్డీఏ నేతగా మోడీ ఉన్నప్పటికీ 2019 ఎన్నికల సమయంలో ప్రధాని అభ్యర్ధిపై చర్చ జరిగితే నితీశ్ అందులో ఉంటారని వెల్లడించారు.

దీనిపై బీజేపీ సైతం స్పందించింది... ప్రధాని అభ్యర్ధిపై చర్చ అవసరం లేదని, నరేంద్రమోడీని ప్రధాని అభ్యర్ధిగా స్వయంగా నితీశ్ కుమార్ ప్రతిపాదించారని బీజేపీ ఎంపీ సీపీ ఠాకూర్ అన్నారు.  మరోవైపు నితీశ్ కుమార్ బిహార్‌లో మహాకూటమి నుంచి తప్పుకుని తప్పుడు నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.

ప్రధాని అభ్యర్థిగా బిహార్ వాసులు రాహుల్‌వైపు చూస్తున్నారని ఆ పార్టీ నేత ప్రేమ్‌చంద్ర మిశ్రా పేర్కొన్నారు. జేడీయూ ప్రకటనను బట్టి ప్రధానిగా మోడీకి మరోసారి గెలుపొందే అవకాశాలు లేనట్లుగా తెలుస్తోందని ప్రేమ్‌చంద్ర వ్యాఖ్యానించారు. 

click me!