11 మంది అయ్యప్ప భక్తుల దుర్మరణం: తెలంగాణ వాసులే

Published : Jan 06, 2019, 04:33 PM ISTUpdated : Jan 06, 2019, 05:30 PM IST
11 మంది అయ్యప్ప భక్తుల దుర్మరణం:  తెలంగాణ వాసులే

సారాంశం

తమిళనాడు రాష్ట్రంలోని పుదుకోట్టై వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది అయ్యప్ప భక్తులు దుర్మరణం పాలయ్యారు. మృతులంతా మెదక్ జిల్లాకు చెందినవారుగా గుర్తించారు.


చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని పుదుకోట్టై వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది అయ్యప్ప భక్తులు దుర్మరణం పాలయ్యారు. మృతులంతా మెదక్ జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండలం కాజీపేట గ్రామానికి చెందిన 18 మంది అయ్యప్పభక్తులు శబరిమల నుండి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం చోటు చ ేసుకొంది. మధురైకు సమీపంలోని పుదుకొట్టై సమీపంలో ఆదివారం నాడు అయ్యప్ప భక్తులు ప్రయాణీస్తున్న టెంపోట్రాక్స్ ప్రమాదానికి గురైంది.

ఈ ప్రమాదంలో మహేష్,కుమార్, నాగరాజు, శ్యామ్, ప్రవీణ్, కృష్ణ, సాయి,. ఆంజనేయులు, సురేష్ మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. కాజీపేటతో పాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన వారు కూడ ఏడుగురు కూడ ఈ వాహనంలో ఉన్నారని చెబుతున్నారు. తమిళనాడు ప్రభుత్వం ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని ఏపీకి అందించింది

 

 

PREV
click me!

Recommended Stories

BRICS: బ్రిక్స్ సదస్సులో మోదీ వరుస భేటీలు.. దేశ భ‌విష్య‌త్తును మార్చే ఒప్పందాలు
BRICS: బ్రిక్స్ స‌ద‌స్సులో న్యూఢిల్లీ డిక్ల‌రేష‌న్‌కు ఆమోదం.. అస‌లేంటి డిక్ల‌రేష‌న్‌.?