అమూల్యకు నక్సల్స్ తో లింక్స్: సీఎం యడియూరప్ప వ్యాఖ్యలు

Published : Feb 21, 2020, 02:44 PM IST
అమూల్యకు నక్సల్స్ తో లింక్స్: సీఎం యడియూరప్ప వ్యాఖ్యలు

సారాంశం

సీఏఏకు వ్యతిరేకంగా బెంగళూరులో జరిగిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సభలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేసిన అమూల్యకు నక్సలైట్లతో సంబంధాలున్నాయనేది రుజువైందని కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప అన్నారు.

బెంగళూరు: అమూల్యకు బెయిల్ ఇవ్వవద్దని, ఆమెను రక్షించేది లేదని ఆమె తండ్రి కూడా చెప్పారని, ఆమెకు నక్సల్స్ తో సంబంధాలున్నాయని, తగిన శిక్ష పడాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప అన్నారు.  ఆమెకు నక్సల్స్ తో సంబంధాలున్నాయని దీంతో రుజువైందని ఆయన అన్నారు.

 

చాలా కాలం నక్సల్స్ క్రియాశీలంగా ఉన్న ప్రాంతం నుంచి అమూల్య వచ్చిందని, ఫేస్ బుక్ లో చాలా పోస్టులు పెట్టిందని, ఈ కోణంలో కూడా తాము దర్యాప్తు చేస్తామని కర్ణాటక హోం మంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. 

 

బెంగళూరులో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సభలో అమూల్య అనే యువతి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన విషయం తెలిసిందే. ఆమెపై పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు.

Also Read: పాక్ అనుకూల నినాదాల ఎఫెక్ట్: అమూల్య ఇంటిపై దాడి

ఆ దేశద్రోహిని క్షమించకూడదని కర్ణాటక మంత్రి సీటీ రవి అన్నారు. ఆమెపై దేశద్రోహం కేసు పెట్టాల్సిందేనని అన్నారు. సీఏఏ నిరసన పిచ్చితనం చూడండని, బెంగళూరులో ఓ వామపక్ష కార్యకర్త పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు చేసిందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బిెల్ సంతోష్ అన్నారు. 

అమూల్యకు రహస్య ఎజెండా ఉందని, పోలీసులు సమగ్ర విచారణ జరపాల్సి ఉందని బిజెపి ఎంపీ శోభా కరండ్లాజే అన్నారు. అది సీఏఏకు వ్యతిరేకమైన నిరసన కాదని, దేశంలో పాకిస్తాన్ అనుకూల శక్తులు దేశంలో అశాంతిని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్న శక్తుల కార్యక్రమనమని ఆమె అన్నారు. 

Also Read: ఆమెను జైల్లో పెట్టినా, ఆమె కాళ్లు విరగ్గొట్టినా ఫరవాలేదు: అమూల్య తండ్రి

PREV
click me!

Recommended Stories

Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం
PM Surya Ghar Scheme : ఇలా చేశారో విద్యుత్ ఛార్జీలుండవు.. డబ్బులు సేవ్