ఆమెను జైల్లో పెట్టినా, ఆమె కాళ్లు విరగ్గొట్టినా ఫరవాలేదు: అమూల్య తండ్రి

By telugu teamFirst Published Feb 21, 2020, 1:34 PM IST
Highlights

సీఏఏకు వ్యతిరేకంగా బెంగళూీరులో జరిగిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సభలో అమూల్య పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేయడంపై ఆమె తండ్రి స్పందించారు. తాను దిగ్భ్రంతికి గురైనట్లు తెలిపాడు.

బెంగళూరు: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ర్యాలీలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన అమూల్య లియోనా తండ్రి స్పందించారు. సిఏఏకు వ్యతిరేకంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్వహించిన సభలో అమూల్య లియోనా పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన విషయం తెలిసిందే. ఆమె ప్రవర్తించిన తీరుపై ఆమె తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అలాంటి కూతురుని జైల్లో పెట్టినా తప్పు లేదని, ఆమె కోసం తాను ఏ విధమైన న్యాయపోరాటం చేయబోనని ఆయన అననారు. అమూల్య వ్యాఖ్యలు టీవీల్లో, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మీడియా ప్రతినిధులు ఆమె తండ్రిని సంప్రదించారు. 

Also Read: పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు: అమూల్యను ఆపేసిన అసదుద్దీన్ ఓవైసీ (వీడియో)

తన కూతురు ప్రవర్తన చూసి దిగ్బ్రాంతికి గురయ్యానని, ఇలా మాట్లాడవద్దని తాను చాలా సార్లు చెప్పానని, అయితే ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదని ఆయన అన్నారు. ఆమెను జైల్లో పెట్టినా, పోలీసులు ఆమె కాళ్లు విరగ్గొట్టినా తాను పట్టించుకోనని, ఆమె వల్ల తన కటుుంబం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కుంటోందని ఆయన చెప్పారు. 

తనకు బాగా లేదని, తాను హృద్రోగిని అని, తనను చూడడానికి రావాలని తాను అమూల్యకు చెప్పానని, అయితే నీ ఆరోగ్యం నువ్వే చూసుకో అని సమాధానం ఇచ్చిందని, అప్పటి నుంచి తాను ఆమెతో మాట్లాడలేదని ఆయన వివరించారు.

పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసిన అమూల్యపై దేశద్రోహం కేసు నమోదైంది. ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆమెకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. బెంగళూరులో జరిగిన సభలో అమూల్య ఒక్కసారిగా వైదికపైకి ఎక్కి పాకిస్తాన్ కు అనుకూలంగా నినాదాలు చేసింది. దీంతో ఒక్కసారిగా అసదుద్దీన్ ఓవైసీ ఆమె వద్దకు వెళ్లి మైక్ ను లాక్కునే ప్రయత్నం చేశారు. 

అయినా ఆమె వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు వచ్చి ఆమెను తీసుకుని వెళ్లారు. అమూల్య నినాదాలతో తనకు ఏ విధమైన సంబంధం లేదని ఓవైసీ చెప్పారు. ఆమె ఎవరో కూడా తనకు తెలియదని అన్నారు.

click me!