'ప్రధాని మోడీ ముందు.. సీఎం బొమ్మైతో సహా ఆ నేతలంతా కుక్కపిల్లలే.. నిలబడటానికి కూడా వణుకుతారు'

By Rajesh KarampooriFirst Published Jan 5, 2023, 12:35 AM IST
Highlights

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముందు ముఖ్యమంత్రి బసరాజు బొమ్మైతో సహా కర్ణాటక బీజేపీ నేతలంతా కుక్కపిల్లలేనంటూ విపక్ష నేత సిద్ధరామయ్య తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఈ విమర్శలపై సీఎం బొమ్మై అదే తరహాలో స్పందించారు. 

కర్ణాటక రాజకీయలు హీటెక్కాయి. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, ఇతర నేతలపై మాజీ సీఎం,రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ముందు ఈ నేతలు ‘కుక్కపిల్లలేనంటూ’, వాళ్లంతా పీఎం ముందు వణికిపోతున్నారని తీవ్ర విమర్శలు చేశారు.  15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రానికి రూ.5,495 కోట్లు తీసుకురావడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని ఆరోపిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.

అదే సమయంలో.. కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య వివాదాస్పద ప్రకటనపై ముఖ్యమంత్రి బొమ్మై కౌంటర్ ఇచ్చారు. సిద్ధరామయ్య ప్రకటన అతని (కాంగ్రెస్ నాయకుడి) వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రజలకు 'విశ్వసనీయ కుక్క'లా విధేయుడిగా ఉంటానని బొమ్మై అన్నారు. తాను ప్రజలకు విధేయతతో పని చేస్తున్నాననీ, అబద్ధాలు చెప్పి సమాజాన్ని విచ్ఛిన్నం చేసే వారిలా కాకుండా.. తాను నమ్మకంగా పని చేస్తున్నానని బొమ్మై అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎన్నడూ జరగని అనేక ప్రాజెక్టులను కర్ణాటకలో జరిగాయనీ,  ప్రధాని 
మోదీ ‘కామధేనుడు’ లాంటివాడని బొమ్మై అన్నారు.

బొమ్మైపై విమర్శలు 

బుధవారం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన సిద్ధరామయ్య..  బొమ్మైకి కాస్త ధైర్యం చెప్పాలని సవాల్ విసిరారు. ప్రధాని మోదీ ముందు బసవరాజ్ బొమ్మై కుక్కపిల్లలా ఉన్నారనీ,  ప్రధాని ముందు ఆయన వణికిపోతారనీ అన్నారు. 15వ ఆర్థిక సంఘం తన మధ్యంతర నివేదికలో కర్ణాటకకు ప్రత్యేక కేటాయింపులుగా రూ.5,495 కోట్లు సిఫార్సు చేసిందని సిద్ధరామయ్య చెప్పారు. అయితే కర్ణాటకకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ డబ్బు ఇవ్వలేదని సిద్ధరామయ్య అన్నారు. 

దీనిపై బొమ్మై స్పందిస్తూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష నేతకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ ప్రకటన కాంగ్రెస్ నాయకుడి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తోందని బొమ్మై బళ్లారిలో విలేకరులతో అన్నారు. నరేంద్ర మోదీ కర్ణాటకకు 6 వేల కిలోమీటర్ల హైవేలు వేశారనీ, ఇది స్వాతంత్య్రానంతర కాలంలోనే రికార్డు. బెంగళూరు-మైసూరు హైవే ప్రాజెక్ట్, మంగళూరు-కార్వార్ ఓడరేవు, కలసా-బందూర ప్రాజెక్టులకు కూడా ప్రధాని ఆమోదం తెలిపారని చెప్పారు. 

రానున్న రోజుల్లో అప్పర్ కృష్ణా ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి గ్రాంటు విడుదల చేస్తామని బొమ్మై తెలిపారు. అన్ని ప్రధాన నగరాలకు స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యుపిఎ) హయాంలో ఈ పరిస్థితి లేదని ఆయన అన్నారు. ముఖ్యమైన పథకాలన్నీ మోదీ ఇచ్చారని ముఖ్యమంత్రి అన్నారు. జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి గతంలో హోంమంత్రి అమిత్ షాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అతను షాను నాజీ ప్రచారకుడు జోసెఫ్ గోబెల్స్‌తో పోల్చాడు, 

click me!