
కర్ణాటకలోని కలబురగి జిల్లాలో శివకుమార్ అనే బీజేపీ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనకు ముందు తాను రికార్డ్ చేసిన ఆడియో క్లిప్‌లో, తన మరణానికి కర్ణాటక వైద్య విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి శరణ్ ప్రకాష్ పాటిల్ , ఇతర కాంగ్రెస్ కార్యకర్తలు కారణమని శివకుమార్ ఆరోపించారు. తన మరణానికి పాటిల్ ప్రత్యక్ష కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై సులేపత్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆడియో క్లిప్‌లో స్పష్టంగా చెప్పినప్పటికీ.. ఎఫ్ఐఆర్‌లో మాత్రం శివకుమార్ మృతికి అప్పులు, ఆర్ధిక సమస్యలను కారణంగా చూపారు. మరోవైపు శివకుమార్ ఆత్మహత్య వ్యవహారం కర్ణాటకలో రాజకీయాలను వేడెక్కించింది. మంత్రి పాటిల్ వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
(ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. ఆత్మహత్యతో ఎవరూ ఏమీ సాధించలేరు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వస్తే వెంటనే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726) నెంబర్ కు కాల్ చేయండి. వారు కౌన్సిలింగ్ ఇచ్చి మీకు సహాయం చేస్తారు)