కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2023: తొలి మూడు గంటల్లో 13 శాతం పోలింగ్ నమోదు

Published : May 10, 2023, 10:14 AM ISTUpdated : May 10, 2023, 10:46 AM IST
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2023:  తొలి మూడు గంటల్లో  13 శాతం పోలింగ్ నమోదు

సారాంశం

కర్ణాటక అసెంబ్లీ  ఎన్నికల్లో  తొలి మూడు గంటల్లో 13 శాతం పోలింగ్ నమోదైంది.  ప్రముఖులు  తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

బెంగుళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో  తొలి మూడు గంటల్లో  13 శాతం  పోలింగ్  నమోదైంది.  ప్రముఖలు  తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.  ఉదయం నుండి  పోలింగ్  కేంద్రాలకు వచ్చి ఓటర్లు  తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళలకు  ప్రత్యేకంగా  పింక్  పోలింగ్  బూత్ లను  ఏర్పాటు  చేశారు.  ఓటు హక్కును వినియోగించుకొనేందుకు  కొందరు వృద్ధులు  ట్రై సైకిళ్లను  వినియోగించారు.  

కర్ణాటక సీఎం  బొమ్మై , మాజీ సీఎం యడియూరప్ప, కేంద్ర ఆర్ధిక మంత్రి  నిర్మలా సీతారామన్ , కర్ణాటక పీసీసీ  చీఫ్ డీకే శివకుమార్ లు  తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై  ఆయన కూతురు అదితి, కొడుకు భరత్ బొమ్మై, హవేరి  జిల్లా షిగాం  ప్రభుత్వ  ఉన్నత పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 రాష్ట్రంలోని  ఉడిపి జిల్లాలో13.28 శాతం  పోలింగ్ నమోదైంది. బళ్లారి  జిల్లాలో8.54 శాతం పోలింగ్  రికార్డైంది.ఉడిపి జిల్లాలోని బైనడూరులో 10.81 శాతం,  కుందనపూర్ లో14.17 శాతం, ఉడిపి 13.45 శాతం, కౌప్  13.62 శాతం,  కరకాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో 14.61 శాతం  పోలింగ్  నమోదైంది.ఈ దఫా  మాత్రం  ఓటు ప్రం హోం పద్దతిని ఈసీ ప్రవేశ పెట్టిందిబెంగుళూరులోని శాంతి నగర్ లో  సినీ నటుడు  ప్రకాష్ రాజ్  తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.  విజయనగరలో  కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్  తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

also read:కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2023: పోలింగ్ కు సర్వం సిద్దం

మరో వైపు  అబివృద్దికి  ఓటేయాలని  కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై  ప్రజలను  కోరారు.  కాంగ్రెస్  నేతలు అవినీతి గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు.  అనేక మంది కాంగ్రెస్ నేతలు  అవినీతి కేసుల్లో బెయిల్ పై  ఉన్నారని  బొమ్మై  చెప్పారు.  మరో వైపు యువ ఓటర్లు  మార్పు  కోసం  ఓటు హక్కును వినియోగించకుకొంటారని  కర్ణాటక  పీసీసీ చీఫ్  డీకే శివకుమార్ చెప్పారు.  రాష్ట్రంలో  జరిగిన అవినీతి గురించి  యువ ఓటర్లకు తెలుసునని ఆయన చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?