కర్ణాటకలో రోడ్డు ప్రమాదం: గర్భిణీ సహా ఏడుగురు మృతి

Published : Sep 27, 2020, 02:21 PM ISTUpdated : Sep 27, 2020, 02:23 PM IST
కర్ణాటకలో రోడ్డు ప్రమాదం:  గర్భిణీ సహా ఏడుగురు మృతి

సారాంశం

కర్ణాటక రాష్ట్రంలో ఆదివారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో ఆదివారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.

కలబురగి జిల్లాలోని సవలగి గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.  ఆగి ఉన్న ట్రక్కును వేగంగా వచ్చిన కారును ఢీ కొనడంతో గర్భిణీ సహా ఏడుగురు మరణించారు.మృతి చెందినవారినిఇర్ఫాన్ బేగం, రూబియా బేగం, ఆబెదాబీ బేగం, జయజునాబీ, మునీర్, మహ్మద్ అలీ, షౌకత్ అలీ గా గుర్తించారు.

also read:పాకిస్తాన్ ‌లో ప్రమాదం: బస్సుకు నిప్పంటుకొని 13 మంది మృతి

ఆలంద్ తాలుకాలోని ఒకే గ్రామానికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. గర్భిణీని ఆసుపత్రిలో చేర్పించేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.

విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొన్నారు. మృతదేహాలను సమీపంలోని ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Top 10 Banks : ఇండియాలో అతిపెద్ద బ్యాంక్ ఏదో తెలుసా..? ఇన్ని లక్షల కోట్లా..!
Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ