భారత్‌లో బయటపడ్డ మరో భారీ స్కామ్.. 17 బ్యాంకులకు రూ.34,615 కోట్లు టోకరా

By Siva KodatiFirst Published Jun 22, 2022, 8:19 PM IST
Highlights

భారత్‌లో మరో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది.  ఏకంగా 17 బ్యాంకులను అక్షరాల రూ.34,615 కోట్ల మేర ముంచారు డీహెచ్ఎఫ్‌ఎల్ ప్రమోటర్లు కపిల్, ధీరజ్, సుధాకర్ శెట్టి. వీరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. 

భారత్‌లో మరో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఏకంగా 17 బ్యాంకులను ముగ్గురు వ్యాపారవేత్తలు. అది కూడా వెయ్యి కోట్లో, రెండు వేల కోట్లో కాదు. అక్షరాల రూ.34,615 కోట్లు . ఇంత భారీ మోసానికి పాల్పడ్డ డీహెచ్ఎఫ్‌ఎల్ ప్రమోటర్లు కపిల్, ధీరజ్, సుధాకర్ శెట్టిలపై కేసు నమోదు చేసింది సీబీఐ. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా డీహెచ్ఎఫ్‌ఎల్‌కు చెందిన 15 చోట్ల సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

click me!