కమల్ హాసన్ పార్టీ గుర్తు ఇదే..!

By AN TeluguFirst Published Jan 16, 2021, 9:49 AM IST
Highlights

ఎట్టకేలకు కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం పార్టీకి కామన్ గుర్తు దక్కింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. ఈ ఏడాది తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. 

ఎట్టకేలకు కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం పార్టీకి కామన్ గుర్తు దక్కింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. ఈ ఏడాది తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. 

తమకు టార్చ్ లైట్ సింబల్ కేటాయించినట్టు కమల్ హాసన్ ప్రకటించారు. తమ పార్టీ అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేస్తుందని, తమకు అన్ని చోట్లా ఒకే గుర్తు కేటాయించాలంటూ కమల్ హాసన్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేశారు. అలాగే, తమకు టార్చ్ లైట్ సింబల్ కేటాయించాలని కోరారు. ఆయన కోరినట్టే టార్చ్ లైట్ సింబల్ దక్కింది. ఈ విషయాన్ని కమల్ హాసన్ స్వయంగా వెల్లడించారు. 

‘తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 234 సీట్లలో పోటీ చేసేందుకు మనకు కామన్ గుర్తు టార్చ్ లైట్ కేటాయించారు. అన్ని సెగ్మెంట్లలోనూ ఒకే గుర్తు మీద పోటీ చేయవచ్చు. ’ అని కమల్ హాసన్ ఓ ట్వీట్ ద్వారా తెలిపారు. 

తమిళనాడులో ఏప్రిల్ - మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం (ప్రజా న్యాయ కేంద్రం) పార్టీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో టార్చ్ లైట్ గుర్తు మీద పోటీ చేసింది. 3.77 శాతం ఓట్ల శాతం సాధించింది.

తమిళనాడు ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేల మధ్య హోరాహోరీ ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే, కమల్ హాసన్ కూడా ఇతర పార్టీలతో కలసి ఆ రెండు పార్టీలను ఢీకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తే ఆయనతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తామని కమల్ హాసన్ ప్రకటించారు. కానీ, రజినీకాంత్ రాజకీయ పార్టీ పెట్టబోనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ తనకు రజినీ ఆరోగ్యమే ముఖ్యమని, రాజకీయాలు కాదని స్పష్టం చేశారు.

ఇప్పటికే కమల్ హాసన్ పార్టీ పలు హామీలు గుప్పించింది. ప్రభుత్వ నిర్వహణ ఆర్థిక ఎజెండా పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోలో ఏడు అంశాల్ని పొందుపరిచారు. తాను అధికారంలోకి వస్తే ఏయే వర్గాలకు ఏమేమి చేయనున్నారో తెలిపారు. గ్రీన్ ఛానల్ ప్రభుత్వాన్ని సృష్టిస్తామని.. దీని ద్వారా చట్టబద్ధమైన ధృవీకరణ పత్రాలు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. 

పౌరులు ఎక్కడికి వెళ్లకుండానే దరఖాస్తు చేసుకునేలా ఆన్ లైన్ హోంలను క్రియేట్ చేసుకోవచ్చని అన్నారు. ప్రతి ఇంటికి కంప్యూటర్ హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించనున్నట్టు వివరించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సమాన అవకాశాలను కల్పించడానికి రాష్ట్రవ్యాప్తంగా ఇంటి వద్ద నుంచే మహిళలు చేసే ఇంటి పనులను మానిటైజ్ చేసేలా యోచిస్తున్నట్లు పార్టీ పత్రికా ప్రకటనలో తెలిపింది.

click me!