తెలంగాణ విమోచన దినం: హైదరాబాద్-కర్ణాటక పేరు మార్చిన యడ్డీ

Siva Kodati |  
Published : Sep 17, 2019, 04:17 PM ISTUpdated : Sep 17, 2019, 04:18 PM IST
తెలంగాణ విమోచన దినం: హైదరాబాద్-కర్ణాటక పేరు మార్చిన యడ్డీ

సారాంశం

హైదరాబాద్-కర్ణాటక ప్రాంతాన్ని కళ్యాణ-కర్ణాటకగా ప్రకటించారు కర్ణాటక సీఎం యడియూరప్ప. సంస్థానాల విలీనం అనంతరం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ఈ ప్రాంతం మొత్తం కర్ణాటక రాష్ట్రంలో కలిసినప్పటికీ.. ఆ ప్రాంతాన్ని మాత్రం ఇప్పటికీ హైదరాబాద్-కర్ణాటకగానే వ్యవహరిస్తున్నారు

హైదరాబాద్-కర్ణాటక ప్రాంతాన్ని కళ్యాణ-కర్ణాటకగా ప్రకటించారు కర్ణాటక సీఎం యడియూరప్ప.

మంగళవారం కలబురిగిలో పర్యటించిన ముఖ్యమంత్రి అనంతరం మాట్లాడుతూ.. ప్రజల చిరకాలంగా ఈ ప్రాంతాన్ని కళ్యాణ-కర్ణాటకగా పేరు పెట్టాలని కోరుతున్నారని.. వారి కోరిక మేరకు పేరు మారుస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు.

గుల్బర్గ, బీదర్, రాయచూర్, యాదగిరి, బళ్లారి, కొప్పళ జిల్లాలతో కూడిన ఈ ప్రాంతం ఒకప్పుడు హైదరాబాద్ సంస్థానంలో ఉండేది.

సంస్థానాల విలీనం అనంతరం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ఈ ప్రాంతం మొత్తం కర్ణాటక రాష్ట్రంలో కలిసినప్పటికీ.. ఆ ప్రాంతాన్ని మాత్రం ఇప్పటికీ హైదరాబాద్-కర్ణాటకగానే వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371-జే ప్రకారం ఈ ప్రాంత ప్రజలకు విద్య, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్ లభిస్తుంది. 

PREV
click me!

Recommended Stories

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. కర్ణాటక హైకోర్టు స్టే
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు