భావప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించడమే: సుప్రీంకోర్టును ఆశ్రయించిన 'కాళి' డైరెక్టర్ లీనా మణిమేకలై 

By Rajesh KarampooriFirst Published Jan 15, 2023, 6:01 AM IST
Highlights

వివాదాస్పద కాళీ సినిమా పోస్టర్‌పై ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్,ఉత్తరాఖండ్‌లలో నమోదైన కేసులను రద్దు చేయాలని డైరెక్టర్ లీనా మణిమేకలై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

కాళీ సినిమా పోస్టర్‌పై కొంతకాలం క్రితం వివాదాలు చెలరేగాయి. కాళీ సినిమా పోస్టర్‌లో  కాళిమాతను అభ్యంతకరంగా  సిగరెట్ తాగుతున్నట్లు చూపించారు. దీంతో హిందూ దేవతను అనుచితంగా చిత్రీకరించారని ఆరోపిస్తూ వివిధ రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో ఆ పోస్టర్లును బ్యాన్ చేయాలని,  ఆ చిత్రనిర్మాత లీనా మణిమేకలైపై చర్యలు తీసుకోవాలని అనేక ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

తాజాగా ఆ చిత్రనిర్మాత లీనా మణిమేకలై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన పలు ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలని కోరారు. కాళీ సినిమా  పోస్టర్‌పై ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ , ఉత్తరాఖండ్‌లలో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఏకీకృతం చేసి రద్దు చేయాలని అభ్యర్థించారు. చిత్రనిర్మాత ఈ ఎఫ్‌ఐఆర్‌ల కింద క్రిమినల్ ప్రొసీడింగ్‌లపై ఎక్స్-పార్ట్ స్టేను కూడా కోరారు.

Latest Videos

మణిమేకలై తన పిటిషన్‌లో.. సృజనాత్మక చిత్రనిర్మాతగా తన ఉద్దేశ్యం ఎవరి మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం కాదని, అందరినీ కలుపుకొని పోయే దేవత చిత్రాన్ని చిత్రించడమేనని పేర్కొన్నారు. తన సినిమా దేవి విశాల దృక్పథాలను ప్రతిబింబిస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆమె తన పిటిషన్‌లో వ్యక్తిగత ప్రతివాదులతో పాటు నాలుగు రాష్ట్రాలను ప్రతివాదులుగా చేశారు.

పిటిషన్‌లో ఏముంది ?

ఆమెపై రిట్ పిటిషన్ డిసెంబరులో దాఖలు చేయబడింది. అయితే జనవరి 11న నమోదు చేసుకోవచ్చు. మధ్యప్రదేశ్‌లోని లక్నో, రత్లాం, భోపాల్, ఇండోర్, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, ఢిల్లీలోని హజ్రత్‌గంజ్ జిల్లా కోర్టుల్లో తనపై విచారణను మణిమేకలై సవాలు చేశారు. తన సినిమా పోస్టర్‌ను ట్వీట్ చేసిన తర్వాత పలువురు నుంచి బెదిరింపు ఎదుర్కొన్నననీ, చాలా మంది తల నరికివేస్తామని బెదిరించారని చెప్పారు. తనపై అనేక ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి వేధింపులకు గురిచేశారనీ, తన భావప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని అన్నారు.

click me!