‘ప్రజలకు క్షమాపణ చెప్పండి’ : కమల్‌నాథ్‌పై  సీఎం శివరాజ్‌ ఎదురుదాడి

By Rajesh KarampooriFirst Published Jan 15, 2023, 5:37 AM IST
Highlights

మధ్యప్రదేశ్‌ రాష్ట్ర యువత, వృద్ధులు, పేదలు, రైతులకు మాజీ ఎంపీ కమల్‌నాథ్‌ క్షమాపణ చెప్పాలని  సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ డిమాండ్ చేశారు.బర్వానీ జిల్లాలో ఎన్నికల ర్యాలీలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రసంగిస్తూ..  మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్‌పై విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్‌ నేత కమల్‌నాథ్‌పై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని యువత, వృద్ధులు, పేదలు, రైతులకు మాజీ ఎంపీ సీఎం క్షమాపణ చెప్పాలని కమల్‌నాథ్‌పై సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఎదురుదాడి చేశారు. శనివారం బర్వానీ జిల్లాలో ఎన్నికల ర్యాలీలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్  మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్‌పై విరుచుకుపడ్డారు. ముకుళిత హస్తాలతో ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం అధికారంలో ఉన్నప్పుడు చేతులు ముడుచుకుని కూర్చున్నామని, ఇప్పుడు ‘హత్ సే హత్ జోడో’ అనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ నిర్వహించబోతోందని ముఖ్యమంత్రి తెలిపారు.

సిఎం శివరాజ్ చౌహాన్ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్సోళ్లు చేతులు ముడుచుకోకండి.. క్షమాపణలు చెప్పండి! మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏడాదిన్నరగా చేతులు కట్టుకుని కూర్చున్నారు.. ఇప్పుడు  ‘హత్ సే హత్ జోడో’ గురించి మాట్లాడుతున్నారు. కన్యా వివాహ యోజన అందించనందుకు ఆడ  కూతుళ్లకు కాంగ్రెస్ వాళ్లు క్షమాపణలు చెప్పండి. నిరుద్యోగ భృతి ఇస్తామని తప్పుడు హామీలు గుప్పించిన యువకులకు క్షమాపణలు చెప్పండి. కమల్ నాథ్ జీ..మీరు సంబల్ యోజన ఆపేసినందుకు పేదలకు క్షమాపణలు చెప్పాలి. రుణమాఫీ పేరుతో మోసం చేసినందుకు రైతులకు క్షమాపణలు చెప్పండి. పాదయాత్రను  ఆపేసిన కాంగ్రెస్ పెద్దలకు క్షమాపణ చెప్పండి" అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అన్నారు.

ఇటీవల ఇండోర్‌లో జరిగిన ప్రవాసీ భారతీయ సమ్మేళన్ సందర్భంగా.. చాలా మంది ఎన్నారైలు సిఎం శివరాజ్ చౌహాన్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని గందరగోళానికి గురిచేశారని విమర్శించారు, ఆ తర్వాత.. శివరాజ్ చౌహాన్ వేదిక నుండి అందరికి ముకుళిత హస్తాలతో క్షమాపణలు చెప్పాడు.ఈ విషయమై మాజీ సీఎం కమల్‌నాథ్‌ను సమాధానం అడగగా.. సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ ఇంకా చాలా మందికి క్షమాపణలు చెప్పాల్సి ఉంటుందని చెప్పారు. దీనిపై స్పందించిన సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ శనివారం బర్వానీ జిల్లాలో కమల్‌నాథ్‌పై ఎదురుదాడికి దిగారు.


 

click me!