ఈవీఎంల హ్యాకింగ్ కాంగ్రెస్ కుట్ర: రవిశంకర్ ప్రసాద్

By sivanagaprasad kodatiFirst Published Jan 22, 2019, 1:41 PM IST
Highlights

బీజేపీ 2014 సార్వత్రిక ఎన్నికలతో పాటు మరికొన్ని అసెంబ్లీ ఎన్నికల్లో ట్యాంపరింగ్‌కు పాల్పడ్డట్టు వస్తున్న ఆరోపణలపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఘాటుగా బదులిచ్చారు. దేశ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ అపహాస్యం చేస్తోందని ఆయన మండిపడ్డారు

బీజేపీ 2014 సార్వత్రిక ఎన్నికలతో పాటు మరికొన్ని అసెంబ్లీ ఎన్నికల్లో ట్యాంపరింగ్‌కు పాల్పడ్డట్టు వస్తున్న ఆరోపణలపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఘాటుగా బదులిచ్చారు. దేశ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ అపహాస్యం చేస్తోందని ఆయన మండిపడ్డారు.

ఈవీఎంల హ్యాకింగ్ కాంగ్రెస్ కుట్రగా ఆయన అభివర్ణించారు. సార్వత్రికి ఎన్నికలు జరిగే సమయానికి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉందని ఆయన గుర్తు చేశారు.  2014లో దేశప్రజలు ఇచ్చిన తీర్పును తప్పుదారి పట్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు.

లండన్‌లో జరిగిన ఈవెంట్‌కు కపిల్ సిబాల్ ఎందుకు హాజరయ్యారని ఆయన ప్రశ్నించారు. ఈవీఎంల హ్యాకింగ్‌తోనే 2014లో ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో హాల్‌చల్ చేస్తోండటంతో రాజకీయంగా కలకలం రేగింది. 

click me!