సుప్రీం చీఫ్ జస్టిస్‌గా రంజన్ గోగోయ్ ప్రమాణం

By narsimha lodeFirst Published Oct 3, 2018, 11:10 AM IST
Highlights

సుప్రీంకోర్టు చీప్ జస్టిస్ గా రాజన్ గోగోయ్ బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గోగోయ్‌తో  ప్రమాణం చేయించారు


న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చీప్ జస్టిస్ గా రాజన్ గోగోయ్ బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గోగోయ్‌తో  ప్రమాణం చేయించారు.అక్టోబర్ 1వ తేదీన  సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా పదవీ విమరణ చేయడంతో  46వ చీప్ జస్టిస్ గా గోగోయల్  ప్రమాణం చేశారు.

బుధవారం నాడు రాష్ట్రపతి  భవన్ లో జరిగిన కార్యక్రమంలో  రాష్ట్రపతి కోవింద్ చీఫ్ జస్టిస్  గోగోయ్‌తో ప్రమాణం చేయించారు. ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోం:ాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు పలువురు వీఐపీలు  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

నార్త్ ఈస్ట్  రాష్ట్రాల నుండి తొలిసారిగా సుప్రీంకోర్టు జడ్జిగా ఎన్నికైన వ్యక్తిగా గోగోయ్ చరిత్ర సృష్టించారు. జస్టిస్ దీపక్ మిశ్రా స్థానంలో గొగోయ్‌ను ప్రధాన న్యాయమూర్తిగా నియమించడాన్ని సవాల్ చేస్తూ గతవారంలో దాఖలైన ఓ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది..

కోర్టు ఈ విషయంలో కలుగజేసుకోబోదని, ఈ పిటిషన్ ‘‘విచారణార్హం’’ కాదంటూ చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎమ్ ఖాన్వీల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాకు వ్యతిరేకంగా జస్టిస్ గొగోయ్‌ సహా నలుగురు సీనియర్ న్యాయమూర్తులు జనవరి 12న మీడియా సమావేశం ఏర్పాటు చేయడాన్ని తప్పుపడుతూ ఆర్పీ లూత్రా అనే న్యాయవాది ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.


 

click me!