
చండీగఢ్ : 2015లో చండీగఢ్‌లో సంచలనం సృష్టించిన జరిగిన జాతీయ స్థాయి షూటర్ Sippy Sidhu's Murder Caseలో న్యాయమూర్తి కుమార్తె Kalyani Singhను సీబీఐ బుధవారం అరెస్టు చేసింది. అరెస్టు తర్వాత, వారిద్దరి మధ్య ఉన్న సంబంధమే హత్యకు కారణమని ఏజెన్సీ కోర్టుకు తెలిపింది. ఆమెను విచారించడానికి రిమాండ్ కోరుతూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) తన దరఖాస్తులో, కళ్యాణి సింగ్, సుఖ్‌మన్‌ప్రీత్ సింగ్ (అలియాస్ సిప్పీ సిద్ధూ) సన్నిహిత సంబంధంలో ఉన్నారని, ఆమె అతన్ని వివాహం చేసుకోవాలని కోరుకుందని.. అయితే, ఆమె ప్రతిపాదనను సిప్పీ సిద్ధూ తల్లిదండ్రులు తిరస్కరించారని ఏజెన్సీ తెలిపింది.
సిప్పీ సిద్ధూ తన ఫోటోలలో కొన్నింటిని ఆమె తల్లిదండ్రులు, స్నేహితులకు లీక్ చేసింది, ఇలా చేయడం ఆమె కుటుంబాన్ని, ఆమెను ఇబ్బందుల్లోకి నెట్టిందని CBI తెలిపింది. ఆమె తల్లి జస్టిస్ సబీనా ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. జస్టిస్ సబీనా గతంలో చండీగఢ్‌లోని పంజాబ్, హర్యానా హైకోర్టులో విధులు నిర్వహించారు.
సిప్పీ సిద్దూ హత్య కేసులో కళ్యాణి సింగ్ పాత్రపై సీబీఐ.. ప్రత్యేక కోర్టుకు తెలిపింది. హత్యకు రెండు రోజుల ముందు, సెప్టెంబర్ 18, 2015 న, ఆమె సిప్పీ సిద్ధూను "వేరే వ్యక్తుల మొబైల్ ఫోన్ల ద్వారా" సంప్రదించి, తనను చండీగఢ్ లోని సెక్టార్ 27లో ఉన్న ఒక పార్కులో కలవమని "బలవంతం" చేసింది. దీంతో వారు సెప్టెంబర్ 18-20ల మధ్య ఆ పార్క్‌లో కలుసుకున్నారు. సెప్టెంబర్ 20, హత్య జరిగిన రోజు, "సాయంత్రం సిప్పీ సిద్ధూతో ఆమె ఉన్నట్టుగా నిర్ధారించే ఆధారాలు ఉన్నాయి". "ఒక గుర్తుతెలియని దుండగుడు, కళ్యాణి సింగ్ సిప్పీ సిద్ధూను తుపాకీలతో హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత, వారిద్దరూ అక్కడి నుండి పారిపోయారు" అని ఏజెన్సీ కోర్టుకు తెలిపింది.
పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ జడ్జి మనవడు, ప్రముఖ న్యాయవాది కుమారుడు సిప్పీ సిద్ధూపై 2015 సెప్టెంబర్ 20న షార్ట్ గన్ తుపాకీతో నాలుగుసార్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. మరుసటి రోజు ఉదయం అతని మృతదేహం లభ్యమైంది. కళ్యాణి సింగ్ చాలా కాలంగా ఏజెన్సీ స్కానర్‌లో ఉన్నారు. దర్యాప్తులో "సిద్ధూ హంతకుడితో పాటు ఒక మహిళ ఉంది" అని తేలింది. ఆమెపై అభియోగాలు మోపేందుకు తగిన సాక్ష్యాలు తమ వద్ద లేవని, అయితే "ఆమెపై బలమైన అనుమానం" ఉన్నందున దర్యాప్తు కొనసాగించడానికి అనుమతిని కోరుతూ సీబీఐ 2020లో ఈ కేసులో "అన్ ట్రేస్డ్ రిపోర్ట్" దాఖలు చేసింది.
Hamidia hospital: 50 మంది నర్సులపై లైంగిక వేధింపులు! మానవ హక్కుల కమిషన్ సీరియస్
చండీగఢ్ యుటి అడ్మినిస్ట్రేటర్‌గా కూడా పనిచేస్తున్న పంజాబ్ గవర్నర్ జోక్యంతో కేసును జనవరి 2016లో సిబిఐకి అప్పగించారు. ఆ సంవత్సరం సెప్టెంబరులో, ఈ కేసులో ఆధారాలు లేదా క్లూస్ ఇచ్చిన వారికి CBI రూ. 5 లక్షలు ప్రకటించింది. ఆ సమయంలో ఒక వార్తాపత్రిక ప్రకటనలో, సిబిఐ ఇలా పేర్కొంది... "హత్య సమయంలో సిప్పీని చంపిన హంతకుడితో పాటు ఒక మహిళ ఉందని నమ్మడానికి మాకు ఓ కారణం ఉంది. అయితే, ఆమె కనుక నిర్దోషి అయితే.. ఆమె స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే.. ఆమెను రక్షిస్తాం.. అలా కాకపోతే ఆమెను కూడా నిందితురాలిగా పరిగణిస్తాం’’ అని ఆ ప్రకటనలో చెప్పుకొచ్చింది.
అయితే, కేసు సుదీర్ఘంగా సాగడంతో, డిసెంబర్ 2021లో CBI ఆధారాల కోసం రివార్డ్‌ను రూ. 10 లక్షలకు పెంచింది. తాజా విచారణలో స్టేటస్ రిపోర్టు దాఖలు చేసేందుకు సీబీఐ నెల రోజులు గడువు కోరింది. బుధవారం సిబిఐ 10 రోజుల రిమాండ్ కోరగా, కోర్టు నాలుగు రోజుల సమయం ఇచ్చింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇతర వ్యక్తులను కనుగొనడానికి, నేరానికి ఉపయోగించిన ఆయుధాలను, వాహనాలను కనుగొనడానికి ఆమెను విచారించాలని సిబిఐ తెలిపింది.