Hamidia hospital: 50 మంది నర్సులపై లైంగిక వేధింపులు! మానవ హక్కుల కమిషన్ సీరియ‌స్

Published : Jun 16, 2022, 06:33 AM IST
Hamidia hospital: 50 మంది నర్సులపై లైంగిక వేధింపులు! మానవ హక్కుల కమిషన్ సీరియ‌స్

సారాంశం

Hamidia hospital: మధప్రదేశ్ భోపాల్​లోని హమీదియా  ప్రభుత్వాసుపత్రిలో ప‌నిచేస్తున్న‌ 50 మంది నర్సులపై  ఓ మెడికల్ సూపరింటెండెంట్ లైంగిక వేధింపులకు పాల్ప‌డిన‌ట్టు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. దీంతో అక్క‌డి ప్ర‌భుత్వం విచారణకు ఆదేశించింది.    

Hamidia hospital:  చిన్నారులు, మ‌హిళ సంర‌క్ష‌ణ కోసం ప్ర‌భుత్వాలు ఎన్నికఠిన చట్టాలు తీసుకుంటున్న అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. నిత్యం ఏదోక చోట కామాంధుడు చేతిలో అమాయ‌కురాలు బ‌లవుతూనే ఉన్నారు.  తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ప్రభుత్వ హమీడియా ఆసుపత్రిలో లైంగిక ఆరోప‌ణ‌లు క‌లక‌లం రేపుతున్నాయి.  ఆ ఆస్ప‌త్రిలో ప‌ని చేస్తున్న దాదాపు 50 మంది నర్సుల‌పై  తమ మెడికల్ సూపరింటెండెంట్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. ఈ ఘ‌ట‌న ఈ చ‌ర్చ‌నీయంగా మార‌డంతో  ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై విచారణకు ఆదేశించింది. ఇది కాకుండా.. మధ్యప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ (MPHRC) రాష్ట్ర వైద్య విద్యా శాఖ కమిషనర్‌కు కూడా నోటీసు జారీ చేసింది.ఈ విషయంపై 10 రోజుల్లో సమాధానం ఇవ్వాల‌ని కోరింది. మధ్యప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ మంత్రి విశ్వాస్ సారంగ్ ఈ విషయాన్నిమీడియాకు తెలిపారు 
 
హమీడియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ దీపక్ మరావిపై ఫిర్యాదు అందినట్లు మధ్యప్రదేశ్ వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ మీడియాకు తెలిపారు.  ఫిర్యాదు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, డివిజనల్ కమీషనర్ గుల్షన్ బమ్రా దీనిపై విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశామని  తెలిపారు. దాదాపు  50 మంది మహిళా నర్సులు.. డాక్టర్ మరవిపై లైంగిక వేధింపులు, అసభ్యకర చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు, ముఖ్యంగా రాత్రి డ్యూటీలో ఉన్నప్పుడు వారి ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తిస్తాడ‌ని, వికృత చేష్టలతో ఇబ్బంది పెడుతున్నాడని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. 

అదే సమయంలో.. నర్సుల ఫిర్యాదులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ నాథ్ అన్నారు. భోపాల్‌లో ఇటీవల జరిగిన వేధింపులకు వ్యతిరేకంగా ఓ మహిళ ముఖాన్ని బ్లేడ్‌తో నరికి చంపిన ఘటనను ప్రస్తావిస్తూ..  ‘మహిళలు, మైనర్ బాలికలపై జరుగుతున్న అకృత్యాల విషయంలో ఏళ్ల తరబడి మధ్యప్రదేశ్ దేశంలో అగ్రగామిగా నిలిచింది. ఇక‌ చిన్న పిల్ల‌ల‌కు, బాలికలకు కూడా భద్రత లేదు. ఇదేనా సుపరిపాలన? ఇదేనా లా అండ్ ఆర్డర్ ?" అని ప్ర‌శ్నించారు. 

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu