దేశ ద్రోహం కేసులో జేఎన్‌యూ స్టూడెంట్ ఇమామ్ అరెస్ట్

By narsimha lodeFirst Published Jan 28, 2020, 5:23 PM IST
Highlights

జేఎన్‌యూ విద్యార్థి ఇమామ్ ను బీహార్ లో న్యూఢిల్లీ పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. 

న్యూఢిల్లీ: జేఎన్‌యూ విద్యార్థి సర్జీల్ ఇమామ్ ను ఢిల్లీ పోలీసులు మంగళవారం నాడు న్యూఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. జేఎన్‌యూ విద్యార్థి సర్జీల్ ఇమామ్‌పై  రాజద్రోహం కేసు నమోదైంది. అసోం, ఉత్తర్‌ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, న్యూఢిల్లీ, మణిపూర్ పోలీసులు వెతుకుతున్నారు

మంగళవారం నాడు న్యూఢిల్లీ పోలీసులు బీహార్ రాష్ట్రంలోని జహనాబాద్ లో సర్జీల్ ఇమామ్ను అరెస్ట్ చేశారు.  అలీఘడ్ యూనివర్శిటీలో ఈ  ఏడాది జనవరి 16 వ తేదీన సర్జీల్ ఇమామ్ చేసిన ప్రసంగంపై  పోలీసులు కేసు నమోదు చేశారు.  బీహార్ రాష్ట్రంలోని జహానాబాద్ లోని కాకో గ్రామంలో సర్జీల్ ఇమామ్ అరెస్ట్ చేసినట్టుగా బీహార్ రాష్ట్ర డీజీపీ గుప్తేశ్వర్ పాండే చెప్పారు. 

సర్జీల్ ఇమామ్ ఎక్కడ విచారించనున్నారో అక్కడి మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపర్చే అవకాశం ఉంది. బీహార్ రాష్ట్రంలో ఇమ్రాన్ ను హాజరుపరుస్తారా, లేదా ఢిల్లీకి తరలిస్తారా అనేది స్పష్టం కావాల్సి ఉంది.

దేశ విచ్ఛిన్నం కోసం ఎవరు మాట్లాడకూడదని బీహార్ సీఎం నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు. బీహార్ లో సర్జీల్ ఇమామ్ అరెస్ట్ చేయడంపై నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు.

 పోలీసులు చట్ట ప్రకారంగా వ్యవహరించాలని సీఎం నితీష్ కుమార్ చెప్పారు. మరోవైపు నిరసనల్లో భాగంగా ఎవరూ కూడ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడకూదని నితీష్ కుమార్ అభిప్రాయపడ్డారు.దేశ వ్యాప్తంగా మూడు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు  ఇమ్రాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 
 

click me!