పాకిస్తాన్‌ను ఓడించేందుకు పది రోజులు చాలు: మోడీ సంచలనం

By narsimha lodeFirst Published Jan 28, 2020, 3:50 PM IST
Highlights

పాకిస్తాన్ ను ఓడించేందుకు పది రోజులు సరిపోతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 


న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోడీ పాకిస్తాన్‌పై మంగళవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధం వస్తే పాకిస్తాన్‌ను పది నుండి 12 రోజుల్లో ఓడిస్తామని మోడీ తేల్చి పారేశారు.

మంగళవారం నాడు మోడీ ఎన్‌సీసీ 2020 ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు. 70 ఏళ్లలో భారత్ చేతిలో పాకిస్తాన్ మూడుసార్లు ఓడిపోయిందని మోడీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారత్‌తో పాకిస్తాన్ పరోక్షంగా యుద్ధం చేస్తోందని ఆయన ఆరోపించారు. మన సైన్యానికి పాకిస్తాన్ ను ఓడించేందుకు పది నుండి పన్నెండు రోజులు సరిపోతాయని  మోడీ వ్యాఖ్యానించారు.

Also read: నిజాం నిధుల కేసులో పాకిస్తాన్‌కు మరో షాకిచ్చిన లండన్ కోర్టు

దశాబ్దాలుగా భారత్ కు వ్యతిరేకంగా పాక్ తన ప్రయత్నాలు చేస్తోందని  మోడీ చెప్పారు. ఇందులో అనేక మంది బలయ్యారని మోడీ గుర్తు చేశారు.

గత ప్రభుత్వాలు ఈ సమస్యను శాంతి భద్రతల సమస్యగా చూసినట్టుగా మోడీ విమర్శించారు. సైన్యం ప్రభుత్వాల అనుమతి కోసం కోరినా కూడ ఆ ప్రభుత్వాలు సరిగా పట్టించుకోలేదని ప్రధాని తీవ్రంగా వ్యాఖ్యానించారు. 

సీఏఏను వ్యతిరేకిస్తున్నవారంతా పాకిస్తాన్ లో మైనారిటీలపై జరుగుతున్న హింస గురించి ఎందుకు పట్టించుకోవడం లేదో చెప్పాలని మోడీ ప్రశ్నించారు. హింసించిన వారికి సహాయం చేయలేదా అని మోడీ ప్రశ్నించారు.

స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి జమ్మూ కాశ్మీర్ లో సమస్యను పరిష్కరించేందుకు పాలర్టీలు, సంస్థలు ప్రయత్నించలేదని మోడీ విమర్శలు గుప్పించారు.   ఈ సమస్యను పరిష్కరించని కారణంగానే టెర్రరిజం పెరిగిపోయిందని మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 

 
 

click me!