అమిత్ షాతో ఏ డీలూ చేసుకోలేదు, కాంగ్రెస్‌ను వీడిన కారణమిదే: జీతిన్ ప్రసాద

By Siva KodatiFirst Published Jun 10, 2021, 2:31 PM IST
Highlights

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తాను ఏ డీలూ కుదుర్చుకోలేదని స్పష్టం చేశారు బీజేపీ నేత జితిన్ ప్రసాద. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన ఆయన బుధవారం కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తాను ఏ డీలూ కుదుర్చుకోలేదని స్పష్టం చేశారు బీజేపీ నేత జితిన్ ప్రసాద. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన ఆయన బుధవారం కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. తాను పార్టీని వీడటానికి పార్టీలో నాయకత్వ లోపం,  రాహుల్ గాంధీగానీ కారణం కాదని జీతన్ అన్నారు. కాంగ్రెస్‌లో ఉండి ప్రజలకు సేవ చేయలేకపోతున్నానని, ప్రజలకు చేరువయ్యేందుకే బీజేపీలో చేరానని స్పష్టం చేశారు.
 
అమిత్‌షాతోగానీ, జేపీ నడ్డాతోగానీ తాను ఎలాంటి డీల్ చేసుకోలేదని, పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నెరవేరుస్తానని జీతన్ చెప్పారు. తాను ఇప్పటిదాకా రాజకీయాలు చుట్టుముట్టిన పార్టీలో ఉన్నానని, కాబట్టి అందులో ఉండి ప్రజలకు సేవ చేయలేనని భావించానని తెలిపారు. బీజేపీ సంస్థాగతంగా నిర్మితమైన పార్టీ అని.. మిగతా పార్టీలన్నీ వ్యక్తి చుట్టూ తిరిగేవేనని జీతిన్ ప్రసాద స్పష్టం చేశారు.

Also Read:యూపీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలో చేరిన జితన్ ప్రసాద

మరోవైపు జితిన్ ప్రసాద బీజేపీలో చేరడంపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే సూటిగా స్పందించారు. ‘వెళ్లే వాల్లను వెళ్లనీయండి. మేము వారిని ఆపం’ అని ఖర్గే వ్యాఖ్యనించారు. బీజేపీలో చేరాలనేది ఆయన నిర్ణయం అని, ఆయనకు ఇక్కడ (కాంగ్రెస్) కూడా మంచి భవిష్యత్తు ఉందని అన్నారు. 

అయినప్పటికీ ఆయన పార్టీ మారాలని నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమని అన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్న నేపథ్యంలో రాహుల్ సన్నిహితుడుగా పేరున్న జితిన్ ప్రసాద పార్టీ మారడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్ లో ఉండి ప్రజలకు సేవ చేయలేకపోతున్నందునే బీజేపీలో చేరుతున్నానని, జాతీయ పార్టీగా ప్రస్తుతం బీజేపీయే ఉందని జితిన్ ప్రసాద బీజేపీలో చేరిన అనంతరం వ్యాఖ్యానించారు. 
 

click me!