చిరుత‌పులి దాడిలో యువ‌కుడు మృతి.. గ‌త మూడు వారాల్లో నాల్గో ఘ‌ట‌న : అధికారులు

By Mahesh RajamoniFirst Published Dec 29, 2022, 4:31 PM IST
Highlights

Ranchi: చిరుత‌పులి దాడిలో యువ‌కుడు మృతిచెందాడు. గ‌త మూడు వారాల్లో ఈ ప్రాంతంలో చోటుచేసుకున్న నాల్గో ఘ‌ట‌న ఇద‌ని గర్హ్వా జిల్లా అధికారులు తెలిపారు. అలాగే, ఇదివ‌ర‌కు చోటుచేసుకున్న ఘ‌ట‌న‌ల్లో అదే చిరుతపులి న‌లుగురిని చంపినట్లు అనుమానిస్తున్నారు.
 

Young man killed in leopard attack in Jharkhand : చిరుత‌పులి దాడిలో యువ‌కుడు మృతిచెందాడు. గ‌త మూడు వారాల్లో ఈ ప్రాంతంలో చోటుచేసుకున్న నాల్గో ఘ‌ట‌న ఇద‌ని   గర్హ్వా జిల్లా అధికారులు తెలిపారు. అలాగే, ఇదివ‌ర‌కు చోటుచేసుకున్న ఘ‌ట‌న‌ల్లో అదే చిరుతపులి న‌లుగురిని చంపినట్లు అనుమానిస్తున్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. జార్ఖండ్‌లోని గర్హ్వా జిల్లాలో చిరుతపులి  దాడిలో 20 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడనీ, గత మూడు వారాల్లో ఇది నాలుగో మరణం అని ఒక అధికారి గురువారం తెలిపారు. నలుగురినీ ఒకే చిరుతపులి చంపివేసిందని అనుమానిస్తున్నామ‌నీ, గర్వా అటవీ విభాగం దీనిని మ్యాన్ ఈటర్‌గా ప్రకటించే ముసాయిదా ప్రతిపాదనను ఖరారు చేస్తోందని ఆయన అన్నారు. బుధవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో రామ్‌కండలోని కుష్వాహా గ్రామంలోని తన మామ ఇంటి నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా హరేంద్ర నాయక్ అనే యువ‌కుడిపై చిరుతపులి దాడి చేసిందని గర్హ్వా  డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (సౌత్) శశికుమార్ చెప్పిన‌ట్టు వార్తా సంస్థ పీటీఐ నివేదించింది. బాలుడి మెడపై చిరుత దాడి చేయ‌డంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు.

గత 20 రోజుల్లో ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం ఇది నాలుగోసారి అని ఆయన తెలిపారు. డిసెంబరు 19న రాంకా బ్లాక్‌లోని సేవాదిహ్ గ్రామంలో చిరుతపులి చేతిలో ఆరేళ్ల బాలిక మృతి చెందగా, డిసెంబర్ 14న భండారియా బ్లాక్‌లోని రోడో గ్రామంలో మరో ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. అలాగే, డిసెంబరు 10న, లాతేహర్ జిల్లాలోని బర్వాదిహ్ బ్లాక్‌లోని చిపదోహర్ ప్రాంతంలో 12 ఏళ్ల బాలికపై పులి దాడి చేసి ప్రాణాలు తీసుకుంది. డిసెంబరు 19న ఘటన జరిగిన తర్వాత డ్రోన్ కెమెరాల ద్వారా ఆ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తూనే ఉన్నాం.. కానీ, చిరుతపులి జాడ కనిపించలేదు. అది ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఉండొచ్చని భావిస్తున్నామని గర్హ్వా  డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (సౌత్) శశికుమార్ చెప్పారు.

"తాజా సంఘటన తర్వాత, చిరుతపులిని మ్యాన్-ఈటర్‌గా ప్రకటించడానికి మా ముసాయిదా ప్రతిపాదనను పూర్తి చేయడం ప్రారంభించాము. దానిని ఆమోదం కోసం చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్‌కు పంపుతాము" అని తెలిపారు. జంతువును పట్టుకోవడానికి అటవీ శాఖ మూడు బోనులను కూడా ఏర్పాటు చేసింద‌ని తెలిపారు. సూర్యాస్తమయం తర్వాత బయటికి వెళ్లవద్దని అటవీశాఖ సూచించినా గ్రామస్థులు పట్టించుకోవడం లేదని కుమార్ తెలిపారు. "ఈ సమయంలో చిరుతపులి దాడి చేస్తున్నందున సూర్యాస్తమయం తర్వాత వారి ఇళ్ల నుండి బయటకు రావద్దని మేము గ్రామస్తులను, ముఖ్యంగా మహిళలు-పిల్లలను హెచ్చరించాము. వారు బయటకు వెళ్లవలసి వస్తే, వారితో పాటు పురుషుల గుంపు ఉండాలి. డిసెంబరు 15 నుండి ఈ విజ్ఞప్తిని చేస్తున్నాను" అని ఆయన చెప్పారు. 

click me!