కరోనా ఎఫెక్ట్: వారం రోజుల పాటు జార్ఖండ్ లో లాక్‌డౌన్

By narsimha lodeFirst Published Apr 20, 2021, 4:11 PM IST
Highlights

జార్ఖండ్ రాష్ట్రంలో ఈ నెల 22 నుండి 29 వరకు  లాక్‌డౌన్ విధిస్తున్నట్టుగా అధికారులు తెలిపారు.అత్యవసర సేవలకు మాత్రం లాక్‌డౌన్ నుండి మినహాయింపు ఇస్తున్నట్టుగా ఆ రాష్ట్రం ప్రకటించింది.  

న్యూఢిల్లీ: జార్ఖండ్ రాష్ట్రంలో ఈ నెల 22 నుండి 29 వరకు  లాక్‌డౌన్ విధిస్తున్నట్టుగా అధికారులు తెలిపారు.అత్యవసర సేవలకు మాత్రం లాక్‌డౌన్ నుండి మినహాయింపు ఇస్తున్నట్టుగా ఆ రాష్ట్రం ప్రకటించింది.  మతపరమైన సంస్థలు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతించింది. కానీ ఈ ప్రదేశాల్లో జనం గుమికూడడానికి అనుమతివ్వలేదు. మైనింగ్, వ్యవసాయం, నిర్మాణ కార్యక్రమాలు అనుమతిస్తున్నట్టుగా జార్ఖండ్ ప్రభుత్వం తెలిపింది. 

also read:రాహుల్‌గాంధీకి కరోనా: క్వారంటైన్‌లో కాంగ్రెస్ నేత

ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధించింది.  యూపీ రాష్ట్రంలో వీకేండ్ లాక్ డౌన్ అమలు చేయనున్నట్టుగా ప్రకటించింది. మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి.  తెలంగాణ రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూను ఇవాళ్టి రాత్రి నుండి అమలు చేస్తున్నారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్, కర్ణాటక సీఎం యడియూరప్ప, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్ కరోనా బారినపడ్డారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సతీమణి సునీతకు కరోనా సోకింది. దీంతో కేజ్రీవాల్  స్వీయ నిర్భంధంలోకి వెళ్లాడు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ ఏడాది మే 1వ తేదీ నుండి 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది. 

click me!