Jharkhand : జార్ఖండ్‌ ప్రభుత్వాన్నికూల్చే కుట్ర‌.! నోట్ల‌క‌ట్ట‌ల‌తో పట్టుబడ్డ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సస్పెండ్

By Rajesh KFirst Published Jul 31, 2022, 8:43 PM IST
Highlights

Jharkhand Cash Scandal: ప‌శ్చిమ బెంగాల్‌ లోని హౌరాలో భారీ నోట్ల కట్టలతో పట్టుబడ్డ ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో పట్టుబ‌డ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను ఇర్ఫాన్ అన్సారీ, రాజేష్ కచ్చప్, నమన్ బిక్సల్ ల‌ను పార్టీ తక్షణమే సస్పెండ్ చేసినట్లు పార్టీ జనరల్ సెక్రటరీ, జార్ఖండ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ అవినాష్ పాండే తెలిపారు. 
 

Jharkhand Cash Scandal:  జార్ఖండ్ లో రాజకీయ కలకలం రేగింది. బెంగాల్‌ లోని హౌరాలో జార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారీమొత్తంతో పట్టుబడ్డారు. నోట్ల క‌ట్ట‌ల గురించి ప్ర‌శ్నించ‌గా.. డొంక తిరుగుడు స‌మాధానం ఇవ్వ‌డంతో వారిని అరెస్టు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇర్ఫాన్ అన్సారీ, రాజేష్ కచ్చప్, నమన్ బిక్సల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

అదే సమయంలో హౌరా పోలీసులు ముగ్గురు ఎమ్మెల్యేలతో సహా ఐదుగురిని అరెస్టు చేశారు.  ఈ విష‌యంలో ప్ర‌తిప‌క్షాల నుంచి పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డంతో వారిని పార్టీ తక్షణమే సస్పెండ్ చేసినట్లు పార్టీ జనరల్ సెక్రటరీ, జార్ఖండ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ అవినాష్ పాండే తెలిపారు. ఇందులో ప్రమేయం ఉన్నవారిని కూడా శిక్షిస్తామని చెప్పారు. 
 
అవినాష్ పాండే మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జార్ఖండ్‌కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు కోల్‌కతాలోని హౌరాలో భారీమొత్తంతో పట్టుబడ్డారు. ఎమ్మెల్యేలను బెదిరించి ప్రలోభాలకు గురిచేసి.. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జ‌రిగింద‌నీ, బీజేపీ ఈ ప్రయత్నానికి తీవ్రంగా వ్యతిరేకంగా... గతంలోనూ ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైందనీ, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల వద్దకు వస్తున్నారు. కేంద్ర మంత్రి ఒకరు ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని అన్నారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, కాంగ్రెస్‌పై బీజేపీ నిరంతరం దాడి చేస్తోంది. బీజేపీ నాయకుడు జాఫర్ ఇస్లాం ఈ విషయంపై విరుచుకుపడ్డారు. 

జార్ఖండ్‌లోని బెర్మోకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జైమంగల్ సింగ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు లేఖ రాస్తూ, రాజేష్ కచ్చప్,  ఇర్ఫాన్ అన్సారీ త‌న‌ని  కోల్‌కతాకు పిలిచారని, అస్సాం సిఎం హిమంత బిస్వా శర్మను కలవడానికి నన్ను గౌహతికి తీసుకెళ్లబోతున్నారని పేర్కొన్నారు. జార్ఖండ్ ప్రభుత్వాన్ని కూల్చివేసిన తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వంలో ప్రతి ఎమ్మెల్యేకు మంత్రి బెర్త్‌లు, ప్రతి ఎమ్మెల్యేకు రూ. 10 కోట్ల చొప్పున బిస్వా హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
 
తమ సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చేపట్టిన 'ఆపరేషన్ లోటస్' విఫలమైందని జార్ఖండ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ అవినాష్ పాండే అన్నారు. ఈ మొత్తం ఘటనకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కారణమన్నారు. ఇదంతా ఆయన ఆదేశానుసారం జరిగింద‌ని ఆరోపించారు. బీజేపీ ‘ఆపరేషన్ కమలం’ ఇప్పుడు పూర్తిగా బట్టబయలైందని కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ అన్నారు. జైరామ్ రమేష్ ట్వీట్ చేస్తూ.. హౌరాలో బిజెపి 'ఆపరేషన్ లోటస్' బట్టబయలు చేయబడిందని ఆరోపించారు.
  
కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల నుంచి డబ్బు స్వాధీనం చేసుకున్న‌ప్పుడూ .. కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వం సమాధానం చెప్పాలని జార్ఖండ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దీపక్‌ ప్రకాశ్ అన్నారు. బెంగాల్‌పై కూడా భాజపా బాధ్యత వహిస్తుందా? బీజేపీ ఎలాంటి కుట్రలకు పాల్పడలేదన్నారు. పార్టీ పరువు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అదే సమయంలో, టెండర్ నిర్వహణ కోసం ఈ డబ్బు వసూలు చేశారని కాంగ్రెస్ నాయకుడు నిషికాంత్ దూబే ఆరోపించారు.   

click me!