పంజాబ్‌లో చర్చిపై దాడి.. జీసస్ విగ్రహం ధ్వంసం.. పాస్టర్ కారుకు నిప్పు

Published : Aug 31, 2022, 01:04 PM IST
పంజాబ్‌లో చర్చిపై దాడి.. జీసస్ విగ్రహం ధ్వంసం.. పాస్టర్ కారుకు నిప్పు

సారాంశం

పంజాబ్‌లో ఓ చర్చిపై దాడి జరిగింది. కొందరు బలవంతంగా మంగళవారం రాత్రి చర్చిలోకి వెళ్లారు. జీసస్, మేరీ మాత విగ్రహాన్ని ధ్వంసం చేశారు. పాస్టర్ కారుకు నిప్పు పెట్టారు.  

చండీగడ్: పంజాబ్‌లో ఓ చర్చిపై దాడి జరిగింది. కొందరు దుండగులు బలవంతంగా రాత్రి పూట చర్చిలోకి దూసుకెళ్లారు. చర్చిలోని జీసస్, మేరీ మాత విగ్రహాన్ని ధ్వంసం చేశారు. పాస్టర్ కారుకూ నిప్పు పెట్టారు. మంటల్లో కాలిపోతున్న కారు విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తార్న్ తరణ్ జిల్లాలో ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.

అకాల్ తఖ్త్ లీడర్ అకాల్ తఖ్త్ జాతేదర్ ఓ ప్రకటన విడుదల చేశాడు. క్రిస్టియన్ మిషనరీల బలవంతంపుమత మార్పిళ్లు జరుగుతున్నాయని తెలిపారు. కపట విధానాలతో కొన్ని క్రిస్టియన్ మిషనరీలు బలవంతంగా సిక్కులను ఇతర మతంలోకి మారుస్తున్నారని నిన్న ఫేస్‌బుక్ లైవ్‌లో ఆయన పేర్కొన్నారు. పంజాబ్‌లోని సిక్కులు, హిందువులను తప్పుదారి పట్టిస్తున్నారని, వారిని ఇతర మతంలోకి మారుస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఇది ప్రభుత్వ కళ్ల ముందరే జరుగుతున్నాయని తెలిపారు. మతం పేరిట మూఢనమ్మకాలు ప్రచారం చేస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకునే వెసులుబాటు ఉన్నది అని అన్నారు కానీ, ఓటు బ్యాంకు మూలంగా ఏ ప్రభుత్వం కూడా ఈ సమస్యపై దృష్టి సారిం చడం లేదని వివరించారు.

చర్చిపై దాడికి ఉత్ప్రేరకంగా ఇది పని చేసి ఉంటుందని భావిస్తున్నారు. క్రిస్టియన్ మిషనరీలు తమ మార్పిళ్లను రాష్ట్రంలోని సిక్కు నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పంజాబ్ సరిహద్దు రాష్ట్రం అని, ఇక్కడికి విదేశాల నుంచి కూడా విరాళాలు వస్తున్నాయని జియాని గురు‌ప్రీత్ సింగ్ తెలిపారు. ఈ పరిస్థితులను వెంటనే అదుపు చేయాలని, ఆయన కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. 

తార్న్ తారణ్ జిల్లాలోని పట్టి అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో థాకర్‌పూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?