ముంబై బీచ్‌లో రెడ్ అలర్ట్.. గుంపులుగా జెల్లీ ఫిష్‌లు.. వణికిపోతున్న ప్రజలు

First Published Aug 7, 2018, 1:12 PM IST
Highlights

ముంబైలోని జూహూ బీచ్‌కు వెళ్లాలంటే పర్యాటకులు వణికిపోతున్నారు. బాటిల్ జెల్లి‌ఫిష్‌లు తీరం వెంట భారీగా సంచరిస్తున్నాయి. వీటి బారినపడి ఎంతో మంది గాయపడ్డారు. దీంతో బీచ్‌లో ఎక్కడ చూసినా అలర్ట్ బోర్డులు కనిపిస్తున్నాయి

ముంబైలోని జూహూ బీచ్‌కు వెళ్లాలంటే పర్యాటకులు వణికిపోతున్నారు. బాటిల్ జెల్లి‌ఫిష్‌లు తీరం వెంట భారీగా సంచరిస్తున్నాయి. వీటి బారినపడి ఎంతో మంది గాయపడ్డారు. దీంతో బీచ్‌లో ఎక్కడ చూసినా అలర్ట్ బోర్డులు కనిపిస్తున్నాయి.

అయితే అవి అంత విషపూరితం కావంటున్నారు అధికారులు.. వాటి విషం చేపలను మాత్రమే చంపుతుందని.. మనుషులను కరిచినప్పుడు వాటి విషం వల్ల వచ్చిన ప్రమాదం ఏం లేదని.. కాకపోతే నొప్పి మాత్రం బాధిస్తుంటుందని వారు తెలిపారు. ప్రతీ ఏటా జెల్లిఫిష్‌లు బీచ్‌లో సంచరిస్తూనే ఉంటాయని.. కాకపోతే ఈ సారి వాటి సంఖ్య భారీగా ఉండటమే ఈ పరిస్థితికి కారణమని అధికారులు వెల్లడించారు.

click me!