కూతురికి విషం ఇంజక్షన్ ఇవ్వాలని.. కాంపౌండర్ తో పదిలక్షల డీల్.. ఓ కన్నతండ్రి ఘాతుకం...

Published : Aug 08, 2022, 11:09 AM IST
కూతురికి విషం ఇంజక్షన్ ఇవ్వాలని.. కాంపౌండర్ తో పదిలక్షల డీల్.. ఓ కన్నతండ్రి ఘాతుకం...

సారాంశం

ఓ కన్నతండ్రి కూతురి మీద అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. ఆమె ప్రేమ వ్యవహారం నచ్చక చంపడానికి సుపారీ మాట్లాడాడు. 

మీరట్ : మీరట్ లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తన కూతురి ప్రేమాయణం నచ్చని తండ్రి అత్యంత కిరాతకానికి దిగజారాడు. జిమ్ ట్రైనర్ తో తన కూతురు రిలేషన్ పెట్టుకోవడం నచ్చని తండ్రి ఆమెను విషపు ఇంజక్షన్ తో చంపడానికి తెగించాడు. దీనికోసం కాలు విరిగి హాస్పిటల్ లో ఉన్న కూతురికి విషం ఇంజక్షన్ ఇవ్వాలని ఆ హాస్పిటల్ కాంపౌండర్ తో పది లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్ గా లక్ష రూపాయలు కూడా ఇచ్చారు. 

అయితే, వీళ్ల ప్లాన్ వర్కవుట్ కాలేదు. ఇంజక్షన్ ఇవ్వడానికి వెడుతున్న కాంపౌండర్ అనుమానాస్పదంగా కనిపించడంతో వార్డ్ బాయ్ లు అతడిని పట్టుకున్నారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆస్పత్రి అధికారులకు సమాచారం అందించారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితులతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ ఘటన వివరాల్లోకి వెడితే... జూలై 27న,  ఓ 17 ఏళ్ల బాలిక టెర్రస్ మీద ఉండగా.. కోతుల గుంపు వచ్చింది. వాటినుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా, పైకప్పు నుండి జారిపడింది. దీంతో తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఆమెను మీరట్‌లోని కంకేర్‌ఖేడా ప్రాంతంలోని ఆసుపత్రిలో చేరింది. మూడు రోజుల తర్వాత ఆమెను పల్లవ్‌పురంలోని వేరే ఆసుపత్రికి తరలించారు. అక్కడే శనివారం రాత్రి ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

అదనపు కట్నం వేధింపులు.. డ్రగ్స్ మత్తులో భార్య తలపై మూత్రవిసర్జన, చిత్రహింసలు..

పల్లవ్‌పురం ఎస్‌హెచ్‌ఓ అవనీష్‌కుమార్‌ మాట్లాడుతూ.. "విచారణలో కాంపౌండర్ నేరం అంగీకరించాడు. అతని నుండి సగం ఖాళీ సీసాను స్వాధీనం చేసుకున్నాం. అతని వద్ద నుండి రూ. 90,000 కూడా స్వాధీనం చేసుకున్నాం. అతనికి అతనితోపాటు పనిచేసే ఓ వ్యక్తి, మరో స్టాఫ్ నర్సు సహాయం చేశారు. దీనికి సహాయ పడితే ఆమెకు కూడా రూ. 1 లక్ష ఇస్తానని హామీ ఇచ్చాడు. ఈ నేరానికి గానూ.. ఆ అమ్మాయి తండ్రిని, కాంపౌండర్ ను, నర్సును, మరొక వ్యక్తిని అరెస్టు చేసాం. వారిపై IPC సెక్షన్లు 307, 328 కింద కేసు నమోదు చేయబడింది. 

తండ్రి స్థానికంగా బిల్డర్ గా పేరున్న వ్యక్తి. తన కూతురు ఎన్నిసార్లు హెచ్చరించినా ఆ యువకుడితో సంబంధాలు తెంచుకోలేదని విచారణలో తండ్రి వెల్లడించాడు. కాబట్టి, ఆమెపై కుట్ర చేయడానికి అతను స్థానిక కాంపౌండర్ సహాయం తీసుకున్నాడు. అమ్మాయి తండ్రి, కాంపౌండర్ మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత, అతను పని ముగించడానికి నిశ్శబ్దంగా డాక్టర్ కోటు ధరించి వార్డులోకి ప్రవేశించాడు. ఆమెకు ఇంజక్షన్ ఇచ్చి... గప్ చిప్ గా బయటికి వెళ్లబోతుంటే వార్డు బాయ్ లు అతడిని పట్టుకున్నారని పోలీసులు తెలిపారు.

ఆ తరువాత ఆస్పత్రి అధికారులకు సమాచారం అందించగా.. వారు వచ్చి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అందులో సదరు డాక్టర్ కోటు వేసుకున్న వ్యక్తి బాలికకు ఇంజక్షన్‌ వేస్తున్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ తరువాత బాలికకు వెంటనే "విషం" ఇంజక్షన్ కు విరుగుడు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్