JEE Main 2022 postponed: జేఈఈ మెయిన్ పరీక్ష తేదీల్లో మార్పులు.. సవరించిన షెడ్యూల్ ఇదే..

Published : Mar 14, 2022, 01:43 PM IST
JEE Main 2022 postponed: జేఈఈ మెయిన్ పరీక్ష తేదీల్లో మార్పులు.. సవరించిన షెడ్యూల్ ఇదే..

సారాంశం

JEE Main 2022 పరీక్ష తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఏప్రిల్ 16 నుంచి 21 వరకు జరగాల్సిన పరీక్షల తేదీల్లో మార్పు చేస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్ణయం తీసుకుంది.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) దేశవ్యాప్తంగా నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) - 2022 పరీక్ష తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఏప్రిల్ 16 నుంచి 21 వరకు జరగాల్సిన పరీక్షల తేదీల్లో మార్పు చేస్తూ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. జేఈఈ మెయిన్ పరీక్ష తేదీల్లోనే వివిధ రాష్ట్రాల్లో స్థానిక బోర్డు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఏన్టీఏ.. ఈ నిర్ణయం తీసుకుంది. జేఈఈ మెయిన్ పరీక్ష తేదీలు వివిధ రాష్ట్రాల్లోని బోర్డు ఎగ్జామ్స్‌తో క్లాష్ కాకుండా ఉండేలా తాజా షెడ్యూల్ రూపొందించారు. 

ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఏప్రిల్ 16, 17, 18, 19, 20, 21 తేదీల్లో జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే తాజా వాటిని సవరిస్తూ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. సవరించిన తేదీల ప్రకారం.. ఏప్రిల్ 21, 24, 25, 29,  మే 1, 4 తేదీల్లో జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహించారు. విద్యార్థులు పరీక్ష సెంటర్‌లకు సంబంధించిన నగరాల జాబితా సమాచారం ఏప్రిల్ మొదటి వారంలో తెలియజేయబడుతుందని ఎన్టీఏ తెలియజేసింది. 2022 ఏప్రిల్ రెండో వారం నుంచి admit card డౌన్‌లోడ్ చేసుకునే ప్రక్రియను ప్రారంభించనున్నట్టుగా తెలిపింది.  

మరోవైపు JEE మెయిన్ 2022 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అభ్యర్థులు మార్చి 31 లోపు దరఖాస్తు చేసుకునేందకు అధికారులు వీలు కల్పించారు. ఫీజులను jeemain.nta.nic.inలో ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. కనీసం ఐదు సబ్జెక్టులతో ప్లస్ 2 పాసైన అభ్యర్థులు ఇంజనీరింగ్ ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌