ఒంటిపై నూలుపోగు లేకుండా.. నగ్నంగా రోడ్ల మీద జెడీయూ నేత హల్ చల్..వీడియో వైరల్..చివరికి...

Published : Feb 25, 2022, 12:41 PM IST
ఒంటిపై నూలుపోగు లేకుండా.. నగ్నంగా రోడ్ల మీద జెడీయూ నేత హల్ చల్..వీడియో వైరల్..చివరికి...

సారాంశం

రాజకీయాలంటే నగ్నంగా నడిబజార్లో నిలబడడమే అన్నారెవరో.. దాన్నే నిజం చేసి చూపించాడో నేత. బీహార్ లో జేడీయూ యూత్ లీడర్ ఒకరు పార్టీ దృష్టిలో పడాలని.. ఒంటిమీద నూలు పోగు లేకుండా.. ఫుల్ గా మందు తాగి.. రోడ్లమీద హల్ చల్ చేశాడు. అతను అనుకున్నది నెరవేరింది.. కానీ మరోలా.. ఎలాగంటే...

బీహార్ : పోసాని డైరెక్షన్లో వచ్చిన పొలిటికల్ డ్రామా *ఆపరేషన్ దుర్యోధన’ గుర్తుంది కదా.. ఎంతమంది చూశారో తెలియదు కానీ.. అందులో హీరో ఇంట్రో సీనే సినిమాకు హైలెట్ గా నిలిచింది. సినిమా మీద ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. ఒంటి మీద నూలు పోగు లేకుండా భగవంతుడు (శ్రీకాంత్ క్యారెక్టర్) నగ్నంగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటుంది. అది చూసి షాక్ తిన్న పోలీసులు.. బ్యానర్ కట్టి పక్కకు తీసుకెళ్తారు. దాదాపుగా ఇలాంటి సీనే ఒకటి Real life లో జరిగింది.

nakedగా రోడ్ల మీద తిరుగుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడే ఓ పోల్ కి ఉన్న బ్యానర్లు కట్టి పక్కకు తీసుకెళ్లారు. తీరా అదుపులోకి తీసుకున్నాక అతనొక Political leader అని, పైగా అధికారపక్షానికి చెందిన వ్యక్తిగా గుర్తించి కంగుతిన్నారు. పార్టీ దృష్టిలో పడేందుకే తాను అలా చేశానని సమాధానం ఇవ్వడంతో బిత్తరపోయారు. 
Bihar నలంద జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇస్లాంపూర్ నియోజకవర్గ JDU Youth Leader జయప్రకాశ్ అలియాస్ కరూ.. నగ్నంగా రోడ్లమీద హల్చల్ చేశాడు. సొంత గ్రామం Jagdishpur లో ఫుల్లుగా మద్యం సేవించి… ఒంటి మీద దుస్తులు విప్పదీసి రోడ్డు ఎక్కాడు. ఆపై అక్కడే ఉన్న ఓ లోకల్ లీడర్ ఇంటికి వెళ్లి... అతని కాళ్లదగ్గర కూర్చున్నాడు. తన గురించి పట్టించుకోవాలని, పార్టీ కోసం కష్టపడుతున్నానంటూ బతిమాలుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి ఏం చేస్తాడో అని భయపడి ఆ లీడర్ గప్ చుప్ గా ఉండిపోయాడు.

కాసేపటికి కరూ సోదరుడు వచ్చి అతన్ని బయటకు లాక్కెళ్ళాడు. లిక్కర్ ప్రొహిబిషన్ వుండడంతో ఇంట్లోనే ఉండాలంటూ బతిమాలుకున్నాడు. కానీ, మాట వినని కరూ.. ‘నన్నెవరూ ఏం పీకలేరంటూ..’ తెగ వాగుతూ మళ్లీ రోడ్డెక్కి వీరంగం వేశాడు. ఈ నిరసనతో అయినా పార్టీ తనను గుర్తించాలంటూ కేకలు వేశాడు. అదంతా అక్కడే ఉన్న కొందరు వీడియో రికార్డు చేశారు.

ఆ వీడియో వాట్స్అప్, ఫేస్బుక్లలో అప్పటికప్పుడే వైరల్ కావడం... నిమిషాల వ్యవధిలో పోలీసుల దృష్టికి వెళ్లడం... ఆపై కరూ కటకటాల వెనక్కి వెళ్లడం బుల్లెట్ స్పీడ్ లో జరిగిపోయాయి. లిక్కర్ ప్రొహిబిషన్ యాక్ట్ కింద అతన్ని అరెస్ట్ చేసినట్లు ఇస్లాంపూర్ పోలీసులు వెల్లడించారు. కరూ కోరుకున్నట్లే అధిష్టానం దృష్టిలో పడ్డాడు. కానీ, ఫలితం మరోలా ఉంది. పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఇస్లాంపూర్ జేడీయూ బ్లాక్ ప్రెసిడెంట్ తన్వీర్ అలం ప్రకటించాడు.


 

PREV
click me!

Recommended Stories

రైలు బాత్‌రూమ్‌లో యువ‌తీ,యువ‌కుడు.. 2 గంట‌లైనా త‌లుపు తీయ‌క‌పోయేస‌రికి. వైర‌ల్ వీడియో
Silver Wedding Card : వామ్మో.. పెళ్లి పత్రిక రేటు రూ. 25 లక్షలా? వైరల్ అవుతున్న ఫోటోలు!