దారుణం: కన్నతల్లిని చంపి.. చితిపై చికెన్ కాల్చుకొన్నాడు.

Published : Feb 02, 2021, 09:57 PM IST
దారుణం: కన్నతల్లిని చంపి.. చితిపై చికెన్ కాల్చుకొన్నాడు.

సారాంశం

మద్యం సేవించి ఇంటికి రావొద్దని చెప్పిన తల్లినే చంపాడు ఓ కొడుకు . ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. 

రాంచీ:మద్యం సేవించి ఇంటికి రావొద్దని చెప్పిన తల్లినే చంపాడు ఓ కొడుకు . ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. 

చంపిన తల్లి మృతదేహానికి చితిని పేర్చి నిప్పు పెట్టాడు. ఈ చితిపై  చికెన్ కాల్చుకొని తిన్నాడు. జార్ఖండ్‌లోని వెస్ట్‌ సింగ్‌భూం జిల్లాకు చెందిన సుమీ సోయ్‌ కొడుకు ప్రధాన్‌ సోయ్‌తో కలిసి జీవిస్తోంది. తాగుడుకు బానిసైన ప్రధాన్‌, తల్లికి సాయం చేయకపోగా, ఆమె కష్టపడి సంపాదించిన డబ్బుతో జల్సాలు చేస్తూ కాలం గడిపేవాడు.

 పద్ధతి మార్చుకోవాలని ఎన్నిసార్లు హెచ్చరించినా పట్టించుకునేవాడు కాదు.ఈ క్రమంలో సోమవారం తల్లీకొడుకుల మధ్య గొడవ జరిగింది. గొడవ సమయంలో కర్రతో తల్లిపై  ఆయన బలంగా మోదాడు. ఈ దెబ్బకు తట్టుకోలేక ఆమె మరణించింది.

ఇంట్లోని వస్తువులతో చితి మాదిరిగా పేర్చి శవాన్ని దగ్ధం వేసి నిప్పు పెట్టాడు. అయితే శవం పూర్తిగా కాలలేదు.  తెల్లవారేసరికి సగం కాలిన మృతదేహం కన్పించింది. స్టౌవ్ పై సగం కాలిన డెడ్ బాడీని కాల్చివేయాలని భావించాడు. కానీ అదే సమయంలో సోదరి రావడంతో అసలు విషయం వెలుగు చూసింది.

ఈ దృశ్యాలను చూసిన సోదరి గట్టిగా కేకలు వేయడంతో  ఇరుగుపొరుగు వారు వచ్చి అతడిని కట్టేశాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మద్యం మత్తులో నిందితుడు ఈ దాడికి పాల్పడినట్టుగా విచారణలో ఒప్పుకొన్నాడు. 

PREV
click me!

Recommended Stories

జానకమ్మ జీవితం..ఓ చరిత్ర ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా? | Singer S. Janaki Biography | S Janaki Assets
గాన కోకిల జానకమ్మ చివరి మాటలు ఇవే | Singer S. Janaki No More | Singer S. Janaki Last Word