ఆర్టికల్ 370 రద్దు: మద్దతు పలికిన జమాతే ఉలేమా ఎ హిందూ

By narsimha lodeFirst Published Sep 12, 2019, 4:49 PM IST
Highlights

370 ఆర్టికల్ రద్దుకు జమాతే ఉలేమా ఎ హిందూ సంస్థ మద్దతు ప్రకటించింది.గురువారం నాడు ఆ సంస్థ ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించింది.

న్యూఢిల్లీ:ఆర్టికల్ 370ను రద్దు చేయడాన్ని  ఇండియన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ జమాతే ఏ హిందూ మద్దతు పలికింది.జమ్మూ కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగమని వేర్పాటు ఉద్యమాలు హనికరమని ఆ సంస్థ స్పష్టం చేసింది

.గురువారం నాడు జమాతే ఉలేమా ఏ హిందూ వార్షిక సమావేశం గురువారం నాడు జరిగింది.ఈ సమావేశంలో ఈ తీర్మానాన్ని ఆమోదించింది.తమ సంస్థ దేశం ఐక్యత, సమగ్రత కోసం ఎప్పుడూ కూడ ప్రాముఖ్యత ఇచ్చిందని గుర్తు చేసింది.

వేర్పాటువాద ఉద్యమానికి తమ సంస్థ ఏనాడూ కూడ మద్దతు ఇవ్వలేదని ప్రకటించింది. అయితే ఇటువంటి ఉద్యమాలు భారత్ కు మాత్రమే కాకుండా కాశ్మీర్ ప్రజలకు కూడ నష్టమని ఆ సంస్థ అభిప్రాయపడింది.

మరో వైపు కాశ్మీరీలకు తమ సంఘీభావాన్ని ఈ సంస్థ ప్రకటించింది. కాశ్మీర్ ప్రజల ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించడం, జాతీయ కర్తవ్యంగా భావిస్తున్నామని జమాతే ఏ హిందూ ప్రకటించింది. కాశ్మీర్ ప్రజల సంక్షేమం కోసం భారత్ లో కలిసిపోవడమే ప్రయోజనమని తమ సంస్థ ధృడంగా నమ్ముతోందని ప్రకటించింది.

కాశ్మీర్ ను నాశనం చేసేందుకు శత్రు దేశం ప్రయత్నాలు చేస్తోందని ఆయన ఆ సంస్థ అభిప్రాయపడింది.కాశ్మీర్ లోని అణగారిన ప్రజలు ఇబ్బందులకు గురైనవారిని ప్రత్యర్ధి శక్తులు తమకు అనుకూలంగా ఉపయోగించుకొన్నాయని ఆ సంస్థ పాకిస్తాన్ పై విమర్శలు చేసింది.

ప్రస్తుతం జమ్మూలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కాశ్మీర్ ప్రజలు తిరిగి సాధారణ జీవితాన్ని గడిపేందుకు రాజ్యాంగం కల్పించిన ప్రతి మార్గాలను వినియోగించుకోవాలని ఆ సంస్థ కేంద్రాన్ని కోరింది.

ఈ సంస్థ చేసిన తీర్మాణాలను ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి మహమూద్ మదాని మీడియాకు వివరించారు.దేశ భద్రత, సమగ్రత విషయంలో తాము రాజీపడబోమని ఆయన స్పష్టం చేశారు. 
 

click me!