రోడ్లు బాగుంటేనే ప్రమాదాలు: కొత్తచట్టంపై కర్ణాటక డిప్యూటీ సీఎం వింత వాదన

By Nagaraju penumalaFirst Published Sep 12, 2019, 12:56 PM IST
Highlights

సెప్టెంబర్ 1 నుంచి ఈ చట్టం అమలులోకి వచ్చిన నేపథ్యంలో ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లను బాగు చేరు గానీ భారీ జరినామానాలు విధిస్తారా అంటూ మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలపై కర్ణాటక డిప్యూటీ సీఎం గోవింద్ కర్జోల్ సరికొత్త వాదన తెరపైకి తెచ్చారు.

బెంగళూరు: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మోటార్ వెహికల్ యాక్ట్ 2019పై  దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు నూతన మోటార్ వెహికల్ యాక్ట్ ను వ్యతిరేకిస్తుంటే కొంతమంది మద్దతు పలుకుతున్నారు. 

సెప్టెంబర్ 1 నుంచి ఈ చట్టం అమలులోకి వచ్చిన నేపథ్యంలో ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లను బాగు చేరు గానీ భారీ జరినామానాలు విధిస్తారా అంటూ మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలపై కర్ణాటక డిప్యూటీ సీఎం గోవింద్ కర్జోల్ సరికొత్త వాదన చేశారు. 

అసలు రోడ్లు బాగుంటేనే యాక్సిడెంట్లు జరుగుతాయని బాగాలేని రోడ్ల వల్ల అసలు ప్రమాదాలే జరగవన్నారు. కాబట్టి మంచి రోడ్లే ప్రమాదానికి కారణమంటూ స్పష్టం చేశారు. రోరడ్లు బాగుంటే వాహనాదారులు ఎక్కుడ స్పీడ్ తో వాహనాలను నడిపే ప్రమాదం ఉందని దాని వల్ల ప్రమాదాల బారిన పడతారంటూ కొత్త వాదననున తెరపైకి తీసుకువచ్చారు. 

కర్ణాటక డిప్యూటీ సీఎం గోవింద్ కర్జోల్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకపోతే కేంద్రం అమలు చేస్తున్న నూతన మోటార్ వెహికల్ చట్టంపై ప్రధాని నరేంద్రమోదీ సొంత ఇలాఖా అయిన గుజరాత్ లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దాంతో ఆ రాష్ట్రం ఫైన్లను తగ్గించింది. 

ఇక పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అయితే కొత్త మోటార్ వెహికల్ యాక్ట్ ని తమ రాష్ట్రంలో అమలు చేయమని స్పష్టం చేశారు. సేఫ్ డ్రైవ్ సేవ్ లైఫ్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని చెప్పుకొచ్చారు. పశ్చిమబంగాలో రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గాయని స్పష్టం చేశారు. 

ఇదిలా ఉంటే కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అయితే నూతన మోటార్ వెహికల్ యాక్ట్ 2019 అమలు అనేది ఆయా రాష్ట్రాలపైనే ఆధారపడి ఉంటుందన్నారు. రాష్ట్రప్రభుత్వాలు అమలు చేయాలంటే చేసుకోవచ్చని లేకపోతే తగ్గించుకోవచ్చుననైనా గుర్తుంచుకోవచ్చన్నారు.  
 

click me!