'హజ్' కు అద్భుతమైన ఏర్పాట్లు.. సౌదీ అరేబియా అధికారులపై జామియా హమ్దార్ద్ వ‌ర్సీటీ వీసీ ప్ర‌శంస‌లు

Published : Jun 29, 2023, 09:43 AM IST
'హజ్' కు అద్భుతమైన ఏర్పాట్లు.. సౌదీ అరేబియా అధికారులపై జామియా హమ్దార్ద్ వ‌ర్సీటీ వీసీ ప్ర‌శంస‌లు

సారాంశం

New Delhi: ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది ముస్లింలు ప్రతి సంవత్సరం మక్కాకు వెళ్లి గొప్ప ముస్లిం తీర్థయాత్ర అయిన హజ్ యాత్రను నిర్వహిస్తారు. ఈ ఏడాది జూన్ 26 నుంచి జూలై 1 వరకు హజ్ యాత్ర జరుగుతోంది. సౌదీ అరేబియా మూడేళ్లలో అతిపెద్ద హజ్ యాత్రకు సోమవారం నుంచి ఆతిథ్యం ఇస్తోంది. ఈ క్ర‌మంలోనే క‌రోనా ఆంక్ష‌లు పూర్తిగా తొల‌గించిన త‌ర్వాత చేప‌డుతున్న ఈ ఏడాది హజ్ యాత్ర ఏర్పాట్ల‌పై జామియా హమ్దార్ద్ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ మహమ్మద్ అఫ్సర్ ఆలం ప్ర‌శంస‌లు కురిపించారు.   

Prof. Mohammed Afshar Alam: ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది ముస్లింలు ప్రతి సంవత్సరం మక్కాకు వెళ్లి గొప్ప ముస్లిం తీర్థయాత్ర అయిన హజ్ యాత్రను నిర్వహిస్తారు. ఈ ఏడాది జూన్ 26 నుంచి జూలై 1 వరకు హజ్ యాత్ర జరుగుతోంది. సౌదీ అరేబియా మూడేళ్లలో అతిపెద్ద హజ్ యాత్రకు సోమవారం నుంచి ఆతిథ్యం ఇస్తోంది. ఈ క్ర‌మంలోనే క‌రోనా ఆంక్ష‌లు పూర్తిగా తొల‌గించిన త‌ర్వాత చేప‌డుతున్న ఈ ఏడాది హజ్ యాత్ర ఏర్పాట్ల‌పై జామియా హమ్దార్ద్ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ మహమ్మద్ అఫ్సర్ ఆలం ప్ర‌శంస‌లు కురిపించారు. 

ఈ ఏడాది 1.6 మిలియన్ల మంది ముస్లింలు చేపడుతున్న హజ్ యాత్ర కోసం సౌదీ అరేబియా అధికారులు చేసిన ఏర్పాట్లను న్యూఢిల్లీలోని జామియా హమ్దర్ద్ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ మహమ్మద్ అఫ్సర్ ఆలం ప్రశంసించారు. అరాఫత్ శిబిరంలో ఆయనను అరబ్ న్యూస్ ఇంటర్వ్యూ చేయ‌గా, ప‌లు కీల‌క అంశాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. కింగ్ సల్మాన్ హజ్ కార్యక్రమం కింద సౌదీ అరేబియా పాలకుడు కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ (ఎంబీఎస్) 1300 మంది ప్రత్యేక ఆహ్వానితులలో ప్రొఫెసర్ ఆలం ఒకరు. పవిత్ర మక్కా, మదీనా సంరక్షకుడిగా, రాజుకు కొన్ని విచక్షణలు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌త్యేక ఆహ్వానితును హ‌జ్ కు ఆహ్వానించారు. ''తన జీవితకాలపు పవిత్ర ప్రయాణానికి అతిథిగా నన్ను ఆహ్వానించినందుకు రాజు సల్మాన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని' ప్రొఫెసర్ ఆలం పేర్కొన్నారు. ''ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ముస్లింల నుంచి హజ్ యాత్రకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. నా కుటుంబం, నా కుమార్తె, భార్యతో నన్ను ఆహ్వానించారు. ఈసారి అతిథిగా అల్హమ్దులిల్లాహ్ హజ్ చేస్తున్నామ‌ని' తెలిపారు. 

'గత ఐదు రోజులుగా సౌదీ అరేబియాలో మాకు గొప్ప ఆతిథ్యం లభించింది. అద్భుతమైన ఏర్పాట్లతో మాకు సేవ‌లు అందించారు. మమ్మల్ని ఆహ్వాని౦చిన౦దుకు మేము చాలా స౦తోష౦గా, ఈ ప్రాంతానికి కృతజ్ఞుల౦. ఈ వార్షిక తీర్థయాత్రకు రాజు సల్మాన్ ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో చేరడం అదృష్టంగా భావిస్తున్నానని' ఆయన అన్నారు. పవిత్ర హ‌జ్ ప్రయాణం గురించి తన అనుభవాన్ని పంచుకున్న ఆలం, "ఖచ్చితంగా ఇది గొప్ప అనుభూతి. ప్రతి ముస్లిం తమ జీవితంలో ఒక్కసారైనా మక్కా, మదీనాను సందర్శించాలని కోరుకుంటారు. నాకు ఆహ్వానం అందగానే, చాలా కమిటీలు సందర్శించడంతో నాకు చాలా పని ఉన్నప్పటికీ నేను వెళ్ళాలి అనుకున్నాను. ఇది మంచి అవకాశం. భవిష్యత్తులో అది మనకు లభించకపోవచ్చు"న‌ని తెలిపారు. 

హజ్ ఏర్పాట్లపై ఆలమ్ స్పందిస్తూ యాత్రికులకు అన్ని పౌర, భద్రతా ఏర్పాట్లు, సౌకర్యాలు చాలా బాగున్నాయనీ, 24 గంటలు అన్ని సేవ‌లు అందుబాటులో ఉంటున్నాయ‌ని చెప్పారు. హజ్ యాత్రను విజయవంతం చేసేందుకు అధికారులు ఎంతో కృషి చేస్తున్నారన్నార‌నీ, వారు చేస్తున్న ఏర్పాట్ల‌ను ప్ర‌శంసించారు. కాగా, జూన్ 10 న తీర్థయాత్ర ప్రారంభానికి ముందు, రాజు సల్మాన్ ఈ సంవత్సరం హజ్ యాత్ర‌లో పాల్గొనడానికి 1,000 మంది పాలస్తీనా యాత్రికులకు కూడా ఆతిథ్యం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మరణించిన, గాయపడిన లేదా జైలులో ఉన్న వ్యక్తుల కుటుంబాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా పాలస్తీనా యాత్రికుల నుంచి సౌదీ అధికారులు ఎలాంటి రుసుము వసూలు చేయర‌ని కూడా స‌మాచారం.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్