
అక్టోబర్ 19 , 20 తేదీలలో ప్రధాని నరేంద్ర మోడీ తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా దాదాపు రూ.15,670 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. పర్యటనలో తొలి రోజు (అక్టోబర్ 19)న గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో డిఫెక్స్‌పో 2022ను మోడీ ప్రారంభిస్తారు. జునాగఢ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అలాగే ఇండియా అర్బన్ హౌసింగ్ కాన్‌క్లేవ్ 2022ని ప్రారంభిస్తారు. రాజ్‌కోట్ నగరంలో కీలక ప్రాజెక్ట్‌లకు పునాది రాయి వేసి.. అక్కడ ఏర్పాటు చేసిన వినూత్న నిర్మాణ పద్దతుల ప్రదర్శనను కూడా మోడీ ప్రారంభించనున్నారు. అక్టోబర్ 20న మిషన్ లైఫ్‌ను ప్రారంభించనున్నారు ప్రధాని. తర్వాత కెవాడియాలో జరిగే 10వ హెడ్స్ ఆఫ్ మిషన్స్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు. ఆ తర్వాత వ్యారాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు.
గుజరాత్ పర్యటన ముగిసిన మరుసటి రోజు (అక్టోబర్ 21) తెల్లవారుజామున మోడీ.. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లకు వెళతారు. అక్కడ దాదాపు రూ.3,500 కోట్ల విలువైన కనెక్టివిటీ ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి.. ఈ రెండు పుణ్యక్షేత్రాల్లో వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులపై సమక్ష నిర్వహిస్తారు.
ALso REad:ఉగ్రవాదం, సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ప్రపంచం ఏకం కావాలి: ప్రధాని మోడీ
అక్టోబర్ 22న ఉత్తరాఖండ్ నుంచి తిరిగి రానున్నారు మోడీ. ఆ తర్వాతి రోజున మధ్యప్రదేశ్‌లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) లబ్ధిదారుల గృహ ప్రవేశ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటారు. అనంతరం దేశవ్యాప్తంగా యువతను ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన కార్యక్రమంలోనూ ఆయన పాల్గొంటారు. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు తర్వాత వెల్లడించనున్నాయి.
23న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యకు చేరుకుంటారు ప్రధాని. ఈ సందర్భంగా రామజన్మభూమి తీర్థ క్షేత్ర స్థలాన్ని పరిశీలిస్తారు. అనంతరం భగవన్ శ్రీరాంలాలా విరాజ్‌మన్‌కు ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత శ్రీరామ రాజ్యాభిషేకానికి మోడీ హాజరవుతారు. అనంతరం సరయూ జీ న్యూ ఘాట్ వద్ద హారతిని వీక్షించి... దీపోత్సవ వేడుకలలో పాల్గొంటారు.