కాంగ్రెస్ షాక్: పార్టీకి రాజీనామా చేసిన జైవీర్ షెర్గిల్

By narsimha lodeFirst Published Aug 24, 2022, 6:24 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ బుధవారం నాడు పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ నిర్ణయాలపై ఆయన మండిపడ్డారు. ఏడాదిగా తాను సోనియా సహా  పలువురు నేతలను కలిసేందుకు చేస్తున్న ప్రయత్నాలు నెరవేరలేదన్నారు.

న్యూఢిల్లీ:కాంగ్రెస్ నేత జైవీర్ షెర్గిల్ బుధవారం నాడు జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. ఏడాది పాటు తాను పార్టీకి చెందిన అగ్రనేతలను కలిసేందుకు ప్రయత్నించినా కూడా తనకు అవకాశం దక్కలేదన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల పేర్లు ప్రస్తావించకుండానే ముగ్గురు గాంధీలను తాను ఏడాదిగా ప్రయత్నించినా తనకు అవకాశం దక్కలేదని ఆయన వివరించారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొనే నిర్ణయాలకు క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు పొంతన లేదని ఆయన అభిప్రాయపడ్డారు.  కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడ రాజీనామా చేస్తున్నట్టుగా మీడియా ప్రతినిధుల ప్రశ్నకు ఆయన సమాధానంగా చెప్పారు.

గత ఎనిమిదేళ్లుగా తాను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నట్టుగా చెప్పారు. తాను రాజీనామా చేస్తున్నట్టుగా పార్టీ చీఫ్ సోనియాగాంధీకి షెర్గిల్ ఓ లేఖ రాశారు.  దేశంలో యువత , ఆధునిక భారత దేశం ఆకాంక్షలతో కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు ఏకీభవించడం లేదన్నారు.39 ఏళ్ల న్యాయవాదిగా ఉన్న షెర్గిల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమించారు. కొంతకాలంగా పార్టీ నిర్వహించే మీడియా సమావేశాల్లో కన్పించడం లేదు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్లు గులాం నబీ ఆజాద్ ఆనంద్ శర్మలు పార్టీ పదవులకు రాజీనామా చేసిన తర్వాత ఈ నెలలో షెర్గిల్ రాజీనామా చేశారు. జీ 23 తిరుగుబాటు నేతలుగా పేరొందిన గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మలు  రాజీనామా చేశారు.  

గత కొన్నేళ్లుగా పలు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న పరాజయాలతో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని జీ 23 నేతలు డిమాండ్ చేశారు.  ఈ క్రమంలోనే పలువురు కాంగ్రెస్ నేతలు పార్టీని ీడియ వెళ్లాను. మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జ్యోతిరాదిత్య సింధియా , జితిన్ ప్రసాద్ లు 2020లో కాంగ్రెస్ నుండి బయటకు వచ్చారు. ఈ ఏడాదిలో మాజీ మంత్రి కపిల్ సిబల్, ఆశ్వనీకుమార్, ఆర్పీఎస్ సింగ్ లు పార్టీ నుండ బయటకు వచ్చారు.

 

click me!