పాకిస్థాన్ ఆ "ఐటీ" దూసుకెళ్తుంది.. ఎస్ జైశంకర్

By Rajesh KarampooriFirst Published Oct 2, 2022, 1:54 AM IST
Highlights

భార‌త విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ పాకిస్తాన్ పై మరోసారి విరుచుకుపడ్డారు. పాకిస్థాన్‌ను ఉగ్రవాదంలో నిష్ణాతులైన దేశంగా అభివర్ణించారు. మ‌న‌దేశం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)లో దూసుకెళ్తుంటే.. పాకిస్తాన్ మాత్రం ఇంటర్నేషనల్ టెర్రరిజం(ఐటీ)లో నిష్ణాతులైన దేశంగా మారింద‌ని  వ్యాఖ్యానించారు. 

మ‌రోసారి పాకిస్థాన్‌పై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విమర్శలు గుప్పించారు. పాక్  ఉగ్ర కార్య‌క‌లాపాల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  భారత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)లో దూసుకెళ్తుంటే.. పాకిస్థాన్ మాత్రం ఇంటర్నేషనల్ టెర్రరిజం(ఐటీ)లో ఎక్స్‌పర్ట్ అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  విదేశాంగ మంత్రి ఎస్. నవరాత్రి ఉత్సవాలకు హాజరయ్యేందుకు కనీసం 50 మంది రాయబారులు, హైకమిషనర్లతో కలిసి జైశంకర్ శనివారం గుజరాత్‌లోని వడోదర చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ఉగ్రవాదం విషయంలో ప్రపంచానికి గతంలో కంటే మరింత అవగాహన పెరిగిందన్నారు. దీనిని ప్రపంచం సహించదు. ఉగ్రవాద దేశాల‌పై రోజురోజుకు ఒత్తిడి పెరుగుతోంద‌ని అన్నారు. ఒక దేశాన్ని లక్ష్యంగా చేసుకున్నప్పుడల్లా.. దానికి తగిన సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు.  

పాకిస్థాన్ తనను తాను ఉగ్రవాద బాధితురాలిగా చెప్పుకుంటుంద‌నీ, గత నెలలో ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాక్‌ ప్రధాని షాబాజ్‌ షరీఫ్‌ ప్రపంచ నేతల సమక్షంలో తమ దేశం ఉగ్రవాద రాజ్యమని’ వ్యాఖ్యానించిన తరుణంలో విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ తీవ్రవాదంపై  ప్రకటన చేశారు.  భారతదేశంపై తీవ్రవాదం కొన్ని ఏళ్లుగా కొనసాగుతోందని.. అయితే దీని గురించి ప్రపంచానికి వివరించడంలో భారత్ విజయవంతం అయిందని ఆయన అన్నారు. 

పాకిస్తాన్‌లా ఉగ్రవాదాన్ని మరే దేశం ఆచరించడం లేదనీ, భారత్‌పై పాకిస్థాన్ ఇన్ని యేండ్లు ఏం చేసిందో
ప్రపంచానికి తెలుసున‌ని.. 26/11 ముంబై దాడి తర్వాత.. ఆ విష‌యం చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ రకమైన ప్రవర్తన,  చర్య ఆమోదయోగ్యం కాదనీ,  తీవ్ర పరిణామాలు ఎదుర్కొవల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు.
 
ప్రధాని మోదీ నాయకత్వంలో.. ఉగ్రవాదాన్ని అరికట్టకపోతే.. భవిష్యత్తులో తమకు కూడా హాని కలిగిస్తుందని ఇతర దేశాలు కూడా ఈ విష‌యాన్ని గ్ర‌హించాయ‌ని ఆయన అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలో ప్రపంచ దేశాల‌ను ముందుకు తీసుకెళ్లడంలో భార‌త్  సఫల‌మైంద‌ని,  ఇంతకు ముందు.. ఇతర దేశాలు ఈ సమస్యను ఎక్కడో జరుగుతున్నందున తమపై ప్రభావం చూపదని భావించి విస్మరించేవ‌నీ, నేడు, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే వారిపై ఒత్తిడి తీసుక‌వ‌స్తున్నయ‌ని అన్నారు. ఇది  భార‌త దేశ దౌత్యానికి ఉదాహరణ అని జైశంకర్ అన్నారు. బంగ్లాదేశ్‌తో భారత్ వ్యూహాత్మక ఒప్పందం కారణంగా ఈశాన్య ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని ఆయన పేర్కొన్నారు. 

ఇదిలాఉంటే.. జై శంకర్ ఇటీవలే అమెరికాలో పర్యటించిన విష‌యం తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌లో  ఆ దేశ తీరును ప్ర‌శ్నించారు. అమెరికా, పాకిస్తాన్ కు ఎఫ్-16 విమానాల డీల్ పై ఆయన తీవ్ర‌ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ తో ఎఫ్-16 విమానాల డీల్ ను అమెరికా కొనసాగించాలని నిర్ణయించుకోవడాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించారు. మీరు ఎవరిని ఫూల్స్ చేయలేరు’ అంటూ అమెరికాను నిల‌దీశారు. పాకిస్తాక్ కు ఎఫ్ -16 ఇస్తే ఏం చేస్తుందో అందరికి తెలుసని అన్నారు. ఎఫ్-16 విమానాల విష‌యంలో అమెరికా, పాకిస్తాన్ మ‌ధ్య‌ 450 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది. బైడెన్ సర్కారు ఆమోదం తెలపడం పట్ల భార‌త్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. 
 

click me!