ఓ వ్యక్తి పాము తలపై ముద్దుపెట్టుకోబోయాడు. దాంతో ఆ పాము భయంతో వెనక్కు తిరిగి .. ఆ వ్యక్తి పెదాలపై కాటు వేసింది. ఈ ఘటన కర్ణాటకలోని శివమొగ్గలో వెలుగు చూసింది.
మనలో చాలా మందికి పాములంటే చాలా భయం.. మనం వెళ్లే దారిలో ఓ సారి పాము కనిపిస్తే.. ఇక అంతే ఆ దారిలో వెళ్లడానికి సహసించం.. ఆ దారిలో వెళ్లడం పూర్తిగా మానేస్తాం.. కానీ.. అనుకోకుండా కొన్నిసార్లు మన ఇండ్లలోకి పాములు వస్తుంటాయి. కొన్నిసార్లు పాము కాటుకు గురయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. అలాగే.. కొంత మంది ధైర్యవంతులు పాము కనిపించగానే.. చంపడానికి ప్రయత్నిస్తుంటారు. మరికొందరూ వెంటనే స్నేక్ హెల్స్ సోసైటీ వారికి కబురు చేస్తారు. అయితే.. పాములు పట్టుకునే సమయంలో కొన్ని షాకింగ్ ఘటనలు వెలుగులోకి జరుగుతుంటాయి. ఈ తరహాకు చెందిన ఘటననే నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఓ స్నేక్ క్యాచర్ ఓ పామును పట్టుకున్నాడు. ఏమి అనడం లేదుగా అని దానితో సెల్ఫీలు దిగాడు. ఏదో చనువిచ్చిందిగా అని.. దాన్ని ముద్దుపెట్టుకోవాలని ప్రయ్నతించాడు. ఇంతలో ఊహించని సంఘటన జరిగింది. ఆ పాము సడెన్ గా వెనక్కు తిరిగి.. అతని పెదాలపై కాటు వేసింది. ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని శివమొగ్గలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది.
వివరాల్లోకెళ్తే.. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా భద్రావతి లోని బొమ్మన కట్టలో ఒక పాము ఇంటి ఆవరణలో
కనిపించింది. దీంతో భయాందోళనకు గురయ్యాయి ఆ కుటుంబీకులు స్నేక్ సోసైటికి సమాచారం అందించారు. వెంటనే ఆ సోసైటీకి చెందిన ఓ వ్యక్తి వారి ఇంటికి వచ్చి.. పాము ఉన్న చోటను గుర్తించాడు. చాలా చకచాక్యంగా ఆ పాము పట్టుకున్నాడు. దీంతో ఆ కుటుంబ సభ్యులతో పాటు చుట్టు పక్కన వారు కూడా గాలి పీల్చుకున్నారు.
ఇక్కడి వరకూ అంత బాగానే ఉంది. కానీ పాము పట్టుకున్న వ్యక్తి ఓవర్ యాక్షన్ చేస్తాడు. తాను ఓ హీరోలా ఫీల్ అయ్యాడు. అక్కడ చుట్టుపక్కల ఉన్న వారు ఆ పామును చూసి.. భయపడుతుంటే.. ఆ వ్యక్తి మాత్రం.. పామును పట్టుకున్నాక దానితో ఓ సెల్పీ దిగాడు. అంతటితో ఆగకుండా.. ఆ పాము తలపై ముద్దాడాలకున్నాడు. ఇంతలో సీన్ రివర్స్ అయ్యింది. ఒక్కసారిగా ఆ పాము.. అతడి ముఖంపై కాటు వేసింది. దీంతో ఆ వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
In a horrifying video which has surfaced online, a man from 's was bitten by the on the lip when he tried to kiss it. He survived the . pic.twitter.com/d3ge1A5Wx6
— Hate Detector 🔍 (@HateDetectors)