కోళ్లను దొంగిలిస్తూ పట్టుబడ్డాడు. కట్ చేస్తే.. మరుసటి రోజు.. 

Published : Jun 24, 2023, 11:35 PM IST
కోళ్లను దొంగిలిస్తూ పట్టుబడ్డాడు. కట్ చేస్తే.. మరుసటి రోజు.. 

సారాంశం

పశ్చిమ బెంగాల్‌లోని ఝర్‌గ్రామ్ జిల్లాలో ఓ వ్యక్తి రాత్రిపూట పౌల్ట్రీ ఫామ్‌లో చొరబడి కోళ్లను దొంగిలిస్తూ పట్టుబడ్డాడు. ఆ పౌల్ట్రీ ఫామ్‌ యాజమాని అతడ్ని బంధించి.. చితక్కొట్టడంతో అక్కడిక్కడే చంపినట్లు పోలీసులు తెలిపారు.

పశ్చిమ బెంగాల్‌లోని జార్‌గ్రామ్ జిల్లాలో దారుణం జరిగింది. రాత్రి వేళల్లో పౌల్ట్రీ ఫామ్‌లోకి చొరబడి కోళ్లను దొంగిలిస్తూ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా దొరకపడ్డారు. పట్టుబడిన వ్యక్తిని చితకపడ్డారు.వారి దెబ్బలకు తాళలేకు ఆ వ్యక్తి అక్కడిక్కడే మరణించారు. ఈ మేరకు శనివారం ఝర్‌గ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసు నమోదైంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఝర్‌గ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దల్కాతి గ్రామంలో కోళ్లను దొంగిలించడానికి నూకు మాలిక్  అనే వ్యక్తి ఓ పౌల్ట్రీ ఫామ్‌లోకి ప్రవేశించినట్లు వారు తెలిపారు. మాలిక్ పౌల్ట్రీ ఫామ్ లోకి రావడంలో ఒక్కసారిగా అలజడి ఏర్పడింది. అక్కడే నిద్రిస్తున్న ఆ పౌల్ట్రీ ఫామ్ యజమాని భూపేన్ మహ్తో నిద్రలేచారు. నిందితుడు మాలిక్ కోళ్లను దొంగలిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అనంతరం పొలం బయట ఉన్న కరెంట్ స్థంభానికి కట్టేసి ఇష్టానుసారంగా కొట్టారని ఆరోపించారు.

ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కానీ ఆ దొంగను విడిపించే ప్రయత్నం చేయలేదు. పౌల్ట్రీ ఫామ్ యజమాని దెబ్బలు తాళలేక నిందితుడు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పౌల్ట్రీ ఫామ్ యజమానిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్