విడాకులకు దరఖాస్తు చేసిన ప్రిన్సెస్ ఆఫ్ జైపూర్

sivanagaprasad kodati |  
Published : Dec 09, 2018, 05:16 PM IST
విడాకులకు దరఖాస్తు చేసిన ప్రిన్సెస్ ఆఫ్ జైపూర్

సారాంశం

జైపూర్ రాజకుమారి, సవాయి మాధోపూర్ శాసనసభ్యురాలు దియా కుమారి విడాకులు తీసుకోనున్నారు. జైపూర్ మహారాజు భవానీ సింగ్ కుమార్తె అయిన దియా కుమారి.. నరేంద్ర సింగ్‌తో తొమ్మిదేళ్ల పాటు డేటింగ్ చేసి 1997లో వివాహం చేసుకున్నారు. 

జైపూర్ రాజకుమారి, సవాయి మాధోపూర్ శాసనసభ్యురాలు దియా కుమారి విడాకులు తీసుకోనున్నారు. జైపూర్ మహారాజు భవానీ సింగ్ కుమార్తె అయిన దియా కుమారి.. నరేంద్ర సింగ్‌తో తొమ్మిదేళ్ల పాటు డేటింగ్ చేసి 1997లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు.

అయితే గత కొంతకాలంగా వీరి మధ్య మనస్పర్థలు రావడంతో చట్ట ప్రకారం విడాకులు తీసుకోవాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా హిందూ వివాహ చట్టం సెక్షన్ 13బీ కింద ఆమె గాంధీనగర్ ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు.

తామిద్దరం పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్నట్లు న్యాయస్థానానికి తెలిపారు. రాజకీయాల మీద ఆసక్తితో బీజేపీలో చేరిన దియా కుమారి గత ఎన్నికల్లో సవాయి మాధోపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆమె పోటీకి దూరంగా ఉన్నారు.

వ్యక్తిగత కారణాల వల్ల పోటీకి దూరంగా ఉన్నానని చెప్పడంతో ఆమె స్థానంలో ఆశా మీనా అనే మహిళకు బీజేపీ టికెట్ కేటాయించింది. అయితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దియాను రంగంలోకి దించాలనే ఉద్దేశ్యంతోనే ఆశాను బీజేపీ తెర మీదకు తీసుకొచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది.

PREV
click me!

Recommended Stories

Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్
ప్రధాని మోదీకి కమల్ హాసన్ కీలక విజ్ఞప్తి | Kamal Haasan Pressmeet | Asianet News Telugu