క్షీణించిన డేరాబాబా ఆరోగ్యం.. జైలు నుంచి ఆస్పత్రికి...

By AN TeluguFirst Published Jun 3, 2021, 10:20 AM IST
Highlights

హర్యానాలోని రోహ్ తక్ జిల్లాలో ఉ్న సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఆరోగ్యం క్షిణించింది. దీంతో ఆయనను రోహ్ తక్ లోని పండిట్ దీన్ దయాళ్ శర్మ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పీజీఐ)కు తరలించారు. రామ్ రహీమ్ తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. 

డేరాబాబాగా ప్రసిద్ధి చెందిన గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ను గురువారం ఉదయం 7 గం.ల సయమంలో పటిష్టమైన భద్రత మధ్య జైలునుంచి పీజీఐకి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంతకుముందు మే 12న రక్తపోటు సమస్య కారణంగా రామ్ రహీమ్ ను ఇదే ఆస్పత్రికి తీసుకువచ్చారు. 

రోహ్ తక్ జైలులో శిక్ష అనుభవిస్తున్న రామ్ రహీమ్ గతంలో పెరోల్ పై వచ్చి అనారోగ్యంతో ఉన్న తన తల్లిని కలుసుకున్నారు. తన తల్లి నసీబ్ కౌర్ ను కలవడానికి రామ్ రహీమ్ 21 రోజుల పాటు పెరోల్ కోరారు. కానీ ఒక రోజు మాత్రమే పెరోల్ లభించింది.

ఇద్దరు యువతులమీద అత్యాచారం చేసిన కేసులో దోహిగా తేలిన రామ్ రహీమ్ 2017 నుంచి రోహ్ తక్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ కేసులో అతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. 
 
click me!