మాస్క్ లేదా.. జైలుకి వెళ్లాల్సిందే..!

By telugu news teamFirst Published Nov 19, 2020, 11:44 AM IST
Highlights

మాస్క్ ధరించని వారిని 10 గంటల పాటు జైలులో ఉంచనున్నారు. ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో కలెక్టర్ కరోనా కట్టడికి ప్రత్యేక గౌడ్‌లైన్స్ విడుదల చేశారు. 

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కాగా.. ఈ వైరస్ ని అరికట్టేందుకు అధికారులు చేయని ప్రయత్నాలు అంటూ లేవు.  కాగా.. కరోనాకు కట్టడి చేసేందుకు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు. 

ఉజ్జయిని కలెక్టర్ ఆశీష్ సింగ్ ఆశానుసారం మాస్క్ పెట్టుకోకుండా ఎవరైనా కనిపిస్తే పోలీసులు వారిని అదుపులోకి తీసుకోనున్నారు. మాస్క్ ధరించని వారిని 10 గంటల పాటు జైలులో ఉంచనున్నారు. ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో కలెక్టర్ కరోనా కట్టడికి ప్రత్యేక గౌడ్‌లైన్స్ విడుదల చేశారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ ఉన్నతాధికారులతో మాట్లాడుతూ కరోనా కట్టడి విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని సూచించారు. మాస్క్ పెట్టుకోనివారిపై, సోషల్ డిస్టెన్స్ పాటించనివారిపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందుకోసం పోలీసులు ఇంటింటికీ వెళ్లి కరోనా బాధితుల వివరాలు తెలుసుకోవాలని, వారు బయట తిరగకుండా చూడాలని కలెక్టర్ కోరారు. 

కాగా ఉజ్జయిని జిల్లాలో కొత్తగా 3,944 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 3,703 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. జిల్లాలో కరోనా కారణంగా ఇప్పటివరకూ 97 మంది మృతి చెందారు. ప్రస్తుతం 144 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.

click me!