ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఒక్కరోజే 131మంది మృతి

By telugu news teamFirst Published Nov 19, 2020, 9:57 AM IST
Highlights

బుధవారం ఒక్కరోజే 7,486మందికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల దసరా, దీపావళి పండగల నేపథ్యంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా జరిగిందనే వాదనలు వినపడుతున్నాయి. 

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఆ మధ్యకాలంలో కాస్త కరోనా తగ్గుముఖం పట్టినట్లే అనిపించినా.. తిరిగి మళ్లీ విజృంభించడం అందరికీ ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలో ఇప్పటి వరకు 5లక్షల మందికి పైగా కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. కాగా.. కేవలం నిన్న ఒక్కరోజే 131 మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. దీంతో ఇప్పటి వరకు 7,943 మంది ప్రాణాలు కోల్పోయారు.

బుధవారం ఒక్కరోజే 7,486మందికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల దసరా, దీపావళి పండగల నేపథ్యంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా జరిగిందనే వాదనలు వినపడుతున్నాయి. ఈ పండగల నేపథ్యంలో 62వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని చెప్పారు. కాగా.. ఆ పరీక్షల్లో 12శాతం కరోనా పాజిటివిటీ రేటు పెరిగినట్లు గుర్తించారు. దీపావళి పండగ, వాయు కాలుష్యం కూడా ఢిల్లీ ప్రజలను మరింత బయాందోళనలకు గురిచేస్తోందని అధికారులు చెబుతున్నారు.

నవబర్ 11వ తేదీన అత్యధికంగా ఢిల్లీలో 8,593మంది కరోనా సోకగా.. బుధవారం 7వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.  పండగకు ముందు నగరంలో 42,004 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా.. ఒక్క రోజులో 42,458 పాజిటివ్ కేసులకు చేరిందని చెప్పారు. దీంతో ఇప్పటి వరకు నగరంలో కరోనా సోకిన వారి సంఖ్య 5,03,084 కి చేరిందని చెప్పారు.

ఇదిలా ఉండగా.. ఢిల్లీలో కరోనా వైరస్ పై పోరును ప్రభుత్వం తో బాటు కేంద్రం కూడా నడుం బిగించింది.పెరిగిపోతున్న  కరోనా కేసులకు అడ్డుకట్ట వేసేందుకు, వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు చేపట్టడం ప్రారంభించాయి,. ఇందులో భాగంగా 750 ఐ సీ యూ పడకలతో విశాలమైన హాస్పిటల్ కమ్ కేర్ సెంటర్ ఏర్పాటైంది. 45 మంది డాక్టర్లు, 160 మంది పారామెడికల్ సిబ్బంది హస్తిన చేరుకున్నారు. మరో 30 మంది వైద్యులు, 90 మంది పారామెడికల్ ఉద్యోగులు త్వరలో ఇక్కడికి రానున్నారు. బెంగుళూరు నుంచి 250 వెంటిలేటర్లను భారత్ ఎలెక్ట్రానిక్స్ సంస్థ ఢిల్లీ నగరానికి పంపింది.

click me!