అవును.. బ్రిటిషర్స్‌తో వీర సావర్కర్‌ దోస్తీ నిజమే.. రాహుల్‌కి మద్దతుగా నిలిచిన మహాత్మాగాంధీ ముని మనువడు 

By Rajesh KarampooriFirst Published Nov 18, 2022, 5:41 PM IST
Highlights

స్వాతంత్య్ర పోరాటంలో వీర్‌ సావర్కర్‌ దేశానికి ద్రోహం చేశాడని, బ్రిటిషర్స్‌కు సహకరించి గాంధీ, నెహ్రూ, సర్దార్‌ పటేల్‌ లకు ద్రోహం చేశాడని చేశాడని భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మహాత్మాగాంధీ ముని మనువడు తుషార్‌ గాంధీ.. రాహుల్‌గాంధీకి మద్దతుగా  నిలిచారు

స్వాతంత్ర సమర యోధుడు,హిందుత్వ‌వాది వినాయక్ దామోద‌ర్ సావార్క‌ర్‌(వీడీ సావర్కర్)పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మహాత్మాగాంధీ ముని మనువడు తుషార్‌ గాంధీ.. రాహుల్‌గాంధీకి మద్దతు నిలిచారు. శుక్రవారం రాహుల్ గాంధీతో కలిసి ఆయన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. కాసేపు రాహుల్‭తో కలిసి నడిచారు, ముచ్చటించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ  రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవముందనీ, వీర సావర్కర్ బ్రిటీష్‭ వారికి తొత్తుగా వ్యవహరించారంటూ తుషార్ గాంధీ అన్నారు. ఆయన జైలు నుంచి బయటకు రావడానికి బ్రిటిష్ అధికారులకు క్షమాపణలు చెప్పిన మాట నిజమేనని అన్నారు. వాటికి చారిత్రక ఆధారాలు ఉన్నాయనీ, హిందుత్వత పార్టీలు చేప్పేవి నిజం కావని, అవన్నీఅవాస్తవమని తుషార్ గాంధీ అన్నారు.

ఆయన జోడో యాత్ర గురించి మాట్లాడుతూ.. యాత్ర అనేది మన సంస్కృతిలో భాగమని అన్నారు. యాత్రల వల్లే దేశంలో అనేక విప్లవాలు ప్రారంభమయ్యాయని, కానీ, ప్రస్తుతం మన  మహనీయులు విలువలకు వ్యతిరేకంగా దేశం ప్రయాణిస్తోందని, ప్రజలకు ఏది అవసరమో.. ఏది అనవరసమో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ప్రజల మీద ఉందని అన్నారు.

గురువారం మీడియాతో రాహుల్ గాంధీ మాట్లాడుతూ .. వీర సావర్కర్ ..బ్రిటీష్ వాళ్లకు భయపడ్డారని, ఆయన దేశద్రోహి అని, బ్రిటీష్‭కు తొత్తుగా వ్యవహరించారని, స్వాతంత్రపోరాటంలో గాంధీ, నెహ్రూ, సర్దార్‌ పటేల్‌ లాంటి పోరాట యోధులను ఆయన మోసం చేశాడని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గతంలో కూడా  రాహుల్ గాంధీ.. సావర్కర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను ఆయన వెనక్కి తీసుకోలేదు. కావాలంటే మహారాష్ట్ర ప్రభుత్వం తనను అరెస్టు చేసుకోవచ్చంటూ సవాల్ చేశారు. మ‌హాత్ముడి ఓ విజన్ అయితే..  వీర సావర్క‌ర్‌ది మరో విజ‌న్ అని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ఆ రెండు విజ‌న్ల మ‌ధ్య పోరు సాగుతోందని అన్నారు. ఈ విషయంపై తాను బహిరంగ చర్చకు సిద్దమని అన్నారు. వీర సావర్కర్ అండ‌మాన్ జైలులో ఉన్న సమయంలో బ్రిటీష్ వారికి లేఖలు రాసేవారిని రాహుల్ గాంధీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. 

ఈ తరుణంలో రాహుల్ వ్యాఖ్యలపై సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్ తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీ మీద కేసు నమోదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ..సావర్కర్‌ను అవమానించడం ఇది మొదటిసారి కాదనీ, గతంలోనూ పలు సార్లు సావర్కర్‌ను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు. కాబట్టి తను శివాజీ పార్క్ పోలీస్ స్టేషన్‌లో రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశానని తెలిపారు. 

click me!