అర్థరాత్రి ఇంటికి నిప్పు పెట్టిన ముసుగువ్యక్తులు.. తృటిలో తప్పించుకున్న కుటుంబం.. వీడియో వైరల్...

Published : Jan 13, 2023, 01:57 PM IST
అర్థరాత్రి ఇంటికి నిప్పు పెట్టిన ముసుగువ్యక్తులు.. తృటిలో తప్పించుకున్న కుటుంబం.. వీడియో వైరల్...

సారాంశం

ఓ కుటుంబం ఇంట్లో నిద్రిస్తుండగా.. ఇంటికి నిప్పు పెట్టారు ముసుగు వ్యక్తులు. ఈ ఘటన అంతా సీసీ టీవీలో రికార్డయ్యింది. మంటలు చెలరేగడంతో మెలుకువ వచ్చిన వారు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. 

న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలో గురువారం అర్థరాత్రి షాకింగ్ ఘటన జరిగింది. ముఖానికి ముసుగులు వేసుకుని వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఓ ఇంటికి నిప్పుపెట్టారు. ఈ ప్రమాదం నుంచి తాము  తృటిలో తప్పించుకున్నట్లు ఓ కుటుంబం పోలీసులు తెలిపారు. ఈ సంఘటన భజన్‌పురాలోని వినయ్ పార్క్ లో చోటు చేసుకుంది. 

నఫీస్, అతని కుటుంబ సభ్యులు తమ ఇంట్లో నిద్రిస్తుండగా ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వారి ఇంటికి నిప్పంటించారు. మంటలకు వెంటనే మెలుకువ రావడంతో.. వారు ఎలాగోలా తమ ఇంట్లో నుంచి బయటకు వచ్చారని.. దీంతో పెను విషాదాన్ని నివారించారని అధికారులు తెలిపారు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు ముసుగు వేసుకున్న వ్యక్తులు ఇరుకైన సందులో ఉన్న నఫీస్ ఇంటికి వచ్చారు. వారు తమతో పాటు తెచ్చుకున్న డబ్బాల్లోని మండే ద్రావణాన్ని వారి ఇంట్లోకి చల్లారు. ఆ తరువాత మరో వ్యక్తి అగ్గిపుల్ల గీసి ఆ ఇంటిమీద విసిరాడు. మూడోసారికి  నిప్పు అంటుకోవడంతో వారు అక్కడినుంచివెళ్లిపోయారు. 

పెళ్లైన రెండు నెలలకే యువకుడు ఆత్మహత్య.. అనాథతో ప్రేమవివాహం.. అంతలోనే..

ఇదంతా సీసీ టీవీలో రికార్డయ్యింది. మంటలకు వెంటనే మేలుకున్న ఇంట్లోని వారు అక్కడినుంచి తప్పించుకున్నారు. వెంటనే పోలీసులకు ఆశ్రయించారు. సీసీ టీవీ ఫుటేజీ ప్రకారం.. నిందితులు ముగ్గురి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఘటనానంతరం వారు అక్కడినుంచి అదృశ్యమయ్యారని పోలీసులు తెలిపారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు ఆ ప్రాంతంలో అమర్చిన మరిన్ని సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu