
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తి ప్రమాదకరంగా మారింది. దీనిపై పద్మ శ్రీ డాక్టర్ రణదీప్ గులేరియా స్పందించారు. కొవిడ్ టాస్క్ ఫోర్స్‌కు సారథ్యం వహించిన ఆయన హెచ్3ఎన్2 వైరస్ బారిన పడకుండా కొన్ని జాగ్రత్తలు చెప్పారు. దీని బారిన పడకుండా ప్రజలు మాస్కులు ధరించాలని, చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అంతేకాదు, కరోనా సమయంలో ఉంచినట్టే హైరిస్క్ గ్రూపు వారు ఐసొలేషన్‌లో ఉంచడం మంచిదని వివరించారు.
డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ, ప్రజలు కొవిడ్ అప్రొప్రియేట్ బిహేవియర్‌ను ఫాలో కావాలని, తద్వా తమ ఇమ్యూనిటీని కాపాడుకోవాలని వివరించారు. లేదంటే.. బలహీనులు బయటకు రాకుండా జాగ్రత్తలు వహించి టీకాలు తీసుకోవాలని సూచనలు చేశారు.
మాస్కులు ధరించడం తప్పనిసరి చేయాలా? అని అడగ్గా.. మాస్కులను ధరించాల్సిన అవసరం ఉన్నదని వివరించారు. ఇది డ్రాప్‌లెట్ ఇన్ఫెక్షన్ కాబట్టి, దగ్గు ద్వారా వ్యాపించే ముప్పు ఉంటుందని అన్నారు. కొన్నిసార్లు పిల్లలకు స్కూల్‌లో ఈ వ్యాధి సోకితే.. ఇంటిలోని పెద్దలకు వారి ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నదని వివరించారు. కాబట్టి, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
Also Read: నీ భార్యను ఒక్కసారి పంపిస్తావా?.. భర్తను అడిగిన పొరిగింటి వ్యక్తి.. అతనేం చేశాడంటే?
ప్రతియేడాది ఇన్‌ఫ్లుయెంజా వ్యాపించడం సర్వసాధారణ విషయమే అని తెలిపారు. అయితే, ఈ సారి పలు కారణాల రీత్యాల ఇన్ఫెక్టివిటీ ఎక్కువగా ఉన్నదని వివరించారు. ఇన్‌ఫ్లుయెంజా ఏ సబ్ టైప్ హెచ్1ఎన్1 2009లో ఎక్కువగా ఉన్నదని తెలిపారు. ఇప్పుడు హెచ్3ఎన్2 వైరస్ ప్రబలంగా వ్యాపిస్తున్నదని అన్నారు. గతంలోనూ ఇది రిపోర్ట్ అయిందని, కానీ, ఈ సారి వేరే జీన్ అని తెలిపారు.