ISKCON: బీజేపీ ఎంపీ మేనకా గాంధీకి దిమ్మతిరిగే షాక్.. రూ. 100 కోట్ల పరువునష్టం నోటీసు..  అసలేం జరిగిందంటే..?

Published : Sep 30, 2023, 03:52 AM IST
ISKCON: బీజేపీ ఎంపీ మేనకా గాంధీకి దిమ్మతిరిగే షాక్.. రూ. 100 కోట్ల పరువునష్టం నోటీసు..  అసలేం జరిగిందంటే..?

సారాంశం

ISKCON: భారతీయ జనతా పార్టీ (BJP) ఎంపి మేనకా గాంధీ (Maneka Gandhi)కి ఊహించని షాక్ తగిలింది. పలు తీవ్ర ఆరోపణలు చేసిన ఆమెకు ఇస్కాన్‌ రూ. 100 కోట్ల పరువు నష్టం నోటీసు పంపింది.

ISKCON: భారతీయ జనతా పార్టీ (BJP) ఎంపి మేనకా గాంధీ (Maneka Gandhi)కి ఊహించని షాక్ తగిలింది. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (International Society for Krishna Consciousness) 100 కోట్ల రూపాయల పరువు నష్టం నోటీసు పంపింది. 'ఇస్కాన్' సంస్థ గోవులను కబేళాలకు విక్రయిస్తోందంటూ బీజేపీ ఎంపీ మేనగా గాంధీ చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. దీంతో  "ఇస్కాన్' అభ్యంతరం వ్యక్తం చేసింది. బీజేపీ ఎంపీకి రూ.100 కోట్ల పురువునష్టం నోటీసులు పంపింది. అయితే, మాజీ కేంద్ర మంత్రి ఆరోపణలన్నింటినీ ఇస్కాన్ తోసిపుచ్చింది. 

తీవ్ర ఆరోపణలు

ఇటీవల 'ఇస్కాన్‌'సంస్థపై  మేనకాగాంధీ చేసిన ఆరోపణల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇస్కాన్‌ను ఆమె అతిపెద్ద 'మోసకారి సంస్థ'గా ఆమె అభివర్ణించారు. ఇస్కాన్‌కు దేశంలో అనేక గోశాలలు ఉన్నాయని, వాటి నిర్వహణ కోసం ప్రభుత్వాల నుంచి భారీ మొత్తంతో  భూములు సహా పలు ప్రయోజనాలను పొందుతోందన్నారు. తాను ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ గోశాలను సందర్శించాననీ, ఆ సమయంలో తనకు పాలిచ్చే ఆవు ఒక్కటీ కూడా కనిపించలేదన్నారు. గోవులన్నీ కసాయిలకు అమ్మేశారని ఆరోపించారు. 

ఈ వీడియో వైరల్ కావడంతో ఇస్కాన్ ఫైర్ అయ్యింది. ఇస్కాన్‌పై పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు మేనకా గాంధీకి తాము రూ. 100 కోట్ల పరువు నష్టం నోటీసు పంపామని ఇస్కాన్ కోల్‌కతా వైస్ ప్రెసిడెంట్ , ప్రతినిధి రాధారామన్ దాస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో తెలిపారు. ఇస్కాన్ కు ప్రపంచవ్యాప్తంగా భక్తులు, మద్దతుదారులు, శ్రేయోభిలాషులు మేనకాగాంధీ చేసిన ఆరోపణలతో తీవ్ర ఆవేదనకు గురయ్యారనీ, ఆమె వ్యాఖ్యలు ఇస్కాన్ పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని మండిపడ్డారు. ఇస్కాన్‌పై జరుపుతున్న ఈ దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేసి.. న్యాయం పొందేంతవరకూ తాము వెనక్కి తగ్గమని ఆయన తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Viral News : ఇక జియో ఎయిర్ లైన్స్.. వన్ ఇయర్ ఫ్రీ..?
Viral News: పెరుగుతోన్న విడాకులు.. ఇకపై పెళ్లిళ్లు చేయకూడదని పండితుల నిర్ణయం