Delhi Fire: అజాద్‌పూర్ మార్కెట్లో అగ్నిప్రమాదం.. భారీ ఆస్తి నష్టం

Published : Sep 30, 2023, 03:04 AM IST
Delhi Fire: అజాద్‌పూర్ మార్కెట్లో అగ్నిప్రమాదం.. భారీ ఆస్తి నష్టం

సారాంశం

Delhi Fire: ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.మంటలు క్రమంగా వ్యాపించడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలో దిగి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. 

Delhi Fire: దేశరాజధాని ఢిల్లీలోని ఆజాద్‌పూర్ కూరగాయల మార్కెట్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా గందరగోళ వాతావరణం నెలకొంది. మీడియా కథనాల ప్రకారం.. ఆసియాలోని అతిపెద్ద హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ అయిన ఆజాద్‌పూర్ మండిలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సాయంత్రం 5.20 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగడంతో 11 అగ్నిమాపక వాహనాలను సంఘటనా స్థలానికి తరలించారు.

సాయంత్రం 6.30 గంటలకు మంటలు అదుపులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది.  ఈ అగ్నిప్రమాదంతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే ముందుగా ప్లాస్టిక్‌ డబ్బాలో మంటలు చెలరేగాయని సంఘటనా స్థలంలో ఉన్నవారు చెబుతున్నారు. ఆ తర్వాత మంటలు దావాలంలా వ్యాప్తి చెందాయట. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ రోజుల్లో ఢిల్లీలో అగ్ని ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. రెండు రోజుల క్రితం ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లో ఉన్న బాలికల పీజీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిరంతరం నిఘా పెట్టారు. పీజీలో ఉన్న పిల్లలను వీలైనంత త్వరగా బయటకు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పీజీలో 35 మంది బాలికలు ఉండగా వారిని సురక్షితంగా బయటకు తీశారు.

కొన్ని నెలల క్రితం ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లోని సంస్కృతి కోచింగ్ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కోచింగ్ సెంటర్‌లో చదువుతున్న విద్యార్థులు పైకప్పుపై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. దీంతో పాటు మంటలను ఆర్పేందుకు 11 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని తాడు సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్